News


ఐదు రేటింగ్‌ ఏజెన్సీల పాత్రపైనా సెబీ దర్యాప్తు

Monday 22nd July 2019
news_main1563780350.png-27230

న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ ఎస్‌ గ్రూపు కంపెనీలకు మంచి రేటింగ్‌లు ఇచ్చిన విషయంలో రేటింగ్‌ ఏజెన్సీల పాత్రపై సెబీ తన దర్యాప్తును విస్తృతం చేయనుంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీలకు మంచి రేటింగ్‌లు ఇచ్చిన ఐదు కంపెనీల్లో... ఇప్పటికే రెండు రేటింగ్‌ ఏజెన్సీల సీఈవోలను సెబీ సూచన మేరకు బలవంతంగా సెలవుపై పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐదు రేటింగ్‌ ఏజెన్సీలకు సంబంధించి తీవ్రమైన లోపాలు ఏవైనా చోటు చేసుకున్నాయా అన్న దానిపైనా సెబీ దృష్టి సారించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రేటింగ్‌ విధానాలను ఉద్దేశపూర్వకంగా మార్చడంలో వ్యక్తుల పాత్రను కూడా పరిశీలించనున్నట్టు చెప్పాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్ఎస్‌ గ్రూపు కంపెనీల ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేస్తున్న గ్రాంట్‌ థార్న్‌టన్‌... గ్రూపు తీవ్రమైన నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటోందని, ఆర్థిక పనితీరు బలహీనపడినట్టు రేటింగ్‌ ఏజెన్సీల ఉద్యోగులకు అవగాహన ఉందని, ఈమెయిల్స్‌ సంభాషణల ఆధారంగా గుర్తించి ప్రాథమిక నివేదికలో తెలియజేసింది. దీంతో సెబీ మరింత లోతుగా దర్యాప్తు చేయనుండడం గమనార్హం. 



You may be interested

ఈ ప్రోత్సాహకాలు...లాభాన్నిచ్చేవే

Monday 22nd July 2019

మ్యూచుఫల్‌ ఫండ్స్‌లో టాపప్‌ సిప్‌ సేవిం‍గ్స్‌ ఖాతా కంటే లిక్విడ్‌ ఫండ్స్‌ బెటర్‌ ఇన్వెస్టింగ్‌ను సులభం చేసే బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ బ్యాంకుల్లోనూ అధిక రాబడులకు స్వీప్‌ అకౌంట్లు ఉన్న బీమా పాలసీల్లోనే కవరేజీ పెంపు ప్రభుత్వం ఇచ్చే పన్ను రాయితీలతోనూ ప్రయోజనమే  కొన్ని ఆప్షన్లు కంపెనీలకే కాదు... వినియోగదారులకూ మేలు చేస్తాయి. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అనేది, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా కవరేజీ దానంతట అదే పెరుగుతూ వెళితే ఎంత సౌకర్యంగా ఉంటుందో ఆలోచించిండి. అలాగే, సెక్షన్‌

ఎగుమతుల వృద్ధికి సీఐఐ కీలక సూచనలు

Monday 22nd July 2019

న్యూఢిల్లీ: మహిళల వస్త్రాలు, ఔషధాలు, సైక్లిక్‌ హైడ్రోకార్బన్లు తదితర 31 ఉత్పత్తులు ఎగుమతుల పరంగా ఎక్కువ వృద్ధి అవకాశాలున్నట్టు పారిశ్రామిక సమాఖ్య సీఐఐ ఓ నివేదికలో తెలియజేసింది. ఎనిమిది నెలల తర్వాత దేశ ఎగుమతులు జూన్‌ మాసంలో ప్రతికూల జోన్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. జూన్‌లో ఎగుమతులు 9.71 శాతం తగ్గి 25 బిలియన్‌ డాలర్లకు పరిమితమైన నేపథ్యంలో సీఐఐ ఈ కీలక సూచనలు చేసింది. మన ఉత్పత్తులను వినియోగించే

Most from this category