News


రేటింగ్‌ ఏజెన్సీలకు పెనాల్టీ పెంచే యోచనలో సెబీ

Tuesday 11th February 2020
news_main1581396394.png-31682

న్యూఢిల్లీ: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఎన్‌సీడీలకు రేటింగ్‌ల కేటాయింపులో లోపాలకు గాను రేటింగ్‌ ఏజెన్సీలకు పెనాల్టీలను పెంచే యోచనలో సెబీ ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 2019 డిసెంబర్‌లో సెబీ.. ఇక్రా, కేర్‌ రేటింగ్స్‌, ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌లకు ఒక్కో సంస్థకు రూ.25 లక్షల చొప్పున జరిమానా విధించింది. కానీ, ఆ తర్వాత ఈ సంస్థలకు సంబంధించి తీవ్రమైన అభ్యంతరాలను సెబీ గుర్తించింది. రేటింగ్‌ ఏజెన్సీల వైఫల్యాల స్థాయిలో తాను విధించిన జరిమానా లేదని సెబీ గుర్తించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పెనాల్టీ మొత్తాన్ని ఎందుకు పెంచకూడదంటూ సెబీ నుంచి తమకు షోకాజు నోటీసు వచ్చినట్టు కేర్‌ రేటింగ్స్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. 



You may be interested

రూ.27.85 లక్షల కోట్లకు ఫండ్స్‌ ఆస్తులు

Tuesday 11th February 2020

జనవరిలో రూ.1.2 లక్షల కోట్ల రాక అధిక శాతం పెట్టుబడులు డెట్‌ పథకాల్లోకే డెట్‌ ఫండ్స్‌లోకి రూ.1.09 లక్షల కోట్లు న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫం‍డ్స్‌ పరిశ్రమ (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు/ఏఎంసీ) నిర్వహణలోని ఆస్తులు జనవరిలో కొత్త రికార్డు గరిష్టాలకు చేరాయి. ఫండ్స్‌ ఆస్తులు రూ.27.85 లక్షల కోట్లకు చేరాయి. 44 ఏఎంసీలతో కూడిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశమ నిర్వహణలోని ఆస్తులు 2019 డిసెంబర్‌ చివరికి రూ.26.54 లక్షల కోట్లుగా ఉంటే, జనవరి చివరికి 5

క్రీట్‌ విమానాశ్రయం నిర్మాణం జీఎంఆర్‌ చేతికి

Tuesday 11th February 2020

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుబంధ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ (జీఏఎల్‌) గ్రీస్‌ క్రీట్‌లోని హెరాక్లియోన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్, ఆపరేషన్, నిర్వహణ బిడ్‌ను దక్కించుకుంది. దీంతో యూరోపియన్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ బిడ్‌ గెలిచిన తొలి భారతీయ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్‌గా జీఎంఆర్‌ నిలిచింది. జీఏఎల్, దాని గ్రీస్‌ భాగస్వామి జీఈకే టెర్నా కన్సార్టియం గతేడాది ఫిబ్రవరిలో కన్సెషన్‌ అగ్రిమెంట్‌ మీద సంతకాలు చేసిన విషయం తెలిసిందే.

Most from this category