కరెన్సీ నోట్లను గుర్తించేందుకు మొబైల్ యాప్
By Sakshi

న్యూఢిల్లీ: కంటి చూపు లేని వారు కూడా దేశీ కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేవాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. దీన్ని రూపొందించేందుకు టెక్నాలజీ సంస్థల నుంచి బిడ్స్ ఆహ్వానించింది. నోట్లను మొబైల్ కెమెరా ముందు ఉంచినప్పుడు వాటి విలువను రెండు సెకన్లు లేదా అంతకన్నా తక్కువ వ్యవధిలోనే తెలియజెప్పగలిగే విధంగా యాప్ ఉండాలని ఇందుకు సంబంధించిన ప్రకటనలో ఆర్బీఐ పేర్కొంది. వాయిస్ ఆప్షన్‌తోను, ఇంటర్నెట్ లేకున్నా పనిచేసే విధంగా యాప్ ఉండాలి. దాదాపు 80 లక్షల మంది పైగా కంటి చూపు లేని వారికి ఈ యాప్ ఉపయోగపడగలదని అంచనా.
You may be interested
ఒడిదుడుకుల వారం..!
Monday 13th May 2019- చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాన్ని పెంచిన అమెరికా - అమెరికా–ఇరాన్‌ల మధ్య కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు - సోమవారం సీపీఐ, మంగళవారం డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు - డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, యూపీఎల్, హిందాల్కో, బజాజ్ ఆటో ఫలితాలు ఈవారంలోనే.. ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల వేడి, స్థూల ఆర్థిక అంశాల నేపథ్యంలో.. ఈవారం మార్కెట్లో ఒడిదుడుకులకు ఆస్కారం అధికంగా ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. ‘చైనా ఉత్పత్తులపై అమెరికా
స్పైస్‌జెట్ దివాలా పిటీషన్ తిరస్కృతి
Monday 13th May 2019న్యూఢిల్లీ: నిర్వహణపరమైన రుణాలు బాకీ పడిన చౌక విమానయాన చార్జీల సంస్థ స్పైస్‌జెట్‌పై దివాలా ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ రామ్‌కో సిస్టమ్ దాఖలు చేసిన పిటీషన్‌ను నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తిరస్కరించింది. ఇలాంటి కేసుల్లో రుణాలు, డిఫాల్ట్‌కి సంబంధించిన కచ్చితమైన వివరాలు అవసరమవుతాయని, ఈ కేసులో అలాంటి ఆధారాలు కనిపించడం లేదని పేర్కొంది. రామ్‌కో సిస్టమ్ ఇన్వాయిస్లకు సంబంధించి జారీ అయిన డిమాండ్ నోటీసులను