STOCKS

News


పరిశ్రమలు రివర్స్‌ గేర్‌

Tuesday 12th November 2019
news_main1573528108.png-29512

  • సెప్టెంబర్‌లో పారిశ్రామిక
  • ఉత్పత్తి 4.3 శాతం క్షీణత
  • 2011 అక్టోబర్‌లో 5 శాతం మైనస్‌
  • మళ్లీ ఇప్పుడు అదే తీవ్రత
  • వరుసగా రెండు నెలలుగా నిరాశ
  • ‘మౌలికం’సహా కీలకరంగాలన్నీ మైనస్‌లోనే...

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్‌లో తీవ్ర నిరాశకు గురిచేసింది. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులకు అద్దం పటింది. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం- 2019 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా -4.3 శాతం క్షీణించింది. అంటే 2018 సెప్టెంబర్‌తో పోల్చిచూస్తే (అప్పట్లో 4.6 శాతం వృద్ధిరేటు) పారిశ్రామిక ఉత్పత్తి అసలు పెరక్కపోగా -4.3 శాతం క్షీణించిందన్నమాట. ఇంత తీవ్ర స్థాయి క్షీణత గడచిన ఎనిమిదేళ్లలో ఎన్నడూ నమోదుకాలేదు. 2011 అక్టోబర్‌లో ఐఐపీ 5 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. అటు తర్వాత ఇంత తీవ్ర ప్రతికూల గణాంకం రావడం ఇదే తొలిసారి. ఆగస్టులో  కూడా దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి క్షీణతనే (-1.4 శాతం) నమోదుచేసుకోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో అంశం. భారీ యంత్రపరికరాల ఉత్పత్తిని సూచించే క్యాపిటల్‌ గూడ్స్‌, రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి దీర్ఘకాలిక వినియోగ ఉత్పత్తులుసహా కీలకమైన తయారీ, మౌలికం, నిర్మాణం ఉత్పత్తుల్లోనూ సెప్టెంబర్‌లో ‘మైనస్‌’ ఫలితం వచ్చింది. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

తయారీ:- సూచీలో దాదాపు 60 శాతంపైగా వాటా కలిగిన తయారీ రంగం ఉత్పత్తిలో -3.9 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రంగంలో 4.8 శాతం వృద్ధి నెలకొంది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 17 ప్రతికూలతను నమోదుచేసుకున్నాయి. మోటార్‌ వాహనాలు ప్రత్యేకించి భారీ, మధ్యస్థాయి వాహన ఉత్పత్తి విభాగంలో -24.8 శాతం క్షీణత నమోదయ్యితే, -23.6 శాతం క్షీణతతో తరువాతి స్థానంలో ఫర్నీచర్‌ ఉంది. 
విద్యుత్‌:- ఈ విభాగంలో 8.2 శాతం ఉత్పత్తి వృద్ధి రేటు -2.6 క్షీణతలోకి జారింది. 
మైనింగ్‌:- గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ రంగంలో కనీసం 0.1 శాతం వృద్ధి నమోదయ్యింది. 2019 సెప్టెంబర్‌లో వృద్ధిలేకపోగా -8.5 శాతం క్షీణత వచ్చింది. 
క్యాపిటల్‌ గూడ్స్‌:- ఈ విభాగం ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా - 20.7 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 సెప్టెంబర్‌లో ఈ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు 6.9 శాతం. 
కన్జూమర్‌ డ్యూరబుల్స్‌:- ఈ రంగంలో ఉత్పత్తి కూడా -9.9 శాతం క్షీణించింది. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో కూడా - 0.4 శాతం క్షీణత రావడం గమనార్హం. 
మౌలిక, నిర్మాణ రంగ ఉత్పత్తుల్లో కూడా 6.4 శాతం క్షీణత నమోదయ్యింది. 

త్రైమాసికంగా -0.4 శాతం క్షీణత
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)లో  పారిశ్రామిక ఉత్పత్తి - 0.4 శాతం క్షీణించింది. మొదటి త్రైమాసికంలో 3 శాతం వృద్ధి రేటు రాగా, 2018-19 రెండవ త్రైమాసికంలో 5.3 శాతం వృద్ధి నమోదయ్యింది.  ఇక ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ చూస్తే, దాదాపు నిశ్చలంగా 1.3 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధిరేటు 5.2 శాతం. 

క్యూ2 జీడీపీపై ప్రతికూల ప్రభావం..?
ఏప్రిల్‌-జూన్‌లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 5 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికంలోనైనా (జూలై-సెప్టెంబర్‌) కొంత మెరుగైన ఫలితం వస్తుందన్న ఆశలపై తాజా పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు నీళ్లు జలుతున్నాయి. నవంబర్‌ 29న జూలై-సెప్టెంబర్‌ జీడీపీ ఫలితాలు వెలువడనున్నాయి. You may be interested

హిందాల్కోకు మందగమనం సెగ

Tuesday 12th November 2019

నికర లాభం 33 శాతం డౌన్‌  రూ.29,944 కోట్లకు తగ్గిన ఆదాయం న్యూఢిల్లీ: హిందాల్కో ఇండస్ట్రీస్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 33 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,448 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.974 కోట్లకు తగ్గిందని హిందాల్కో ఇండస్ట్రీస్‌ తెలిపింది. అంతర్జాతీయ మందగమనం, కమోడిటీల ధరలు తగ్గడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని కంపెనీ ఎమ్‌డీ సతీశ్‌

ఈ స్టాక్స్‌ మీకు నచ్చుతాయా..?

Tuesday 12th November 2019

దేశంలోనే అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తుల నిర్వహణ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ అక్టోబర్‌ మాసంలో ఎఫ్‌ఎంసీజీ, ప్రభుత్వరంగ సంస్థలు, ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఐటీసీలో కోటి షేర్లు, అలాగే, ఎన్‌హెచ్‌పీసీలోనూ కోటి షేర్ల చొప్పున కొనుగోలు చేసింది. ఇంకా ఇతర కొనుగోళ్లను పరిశీలించినట్టయితే...   ఎస్‌బీఐ, కోల్‌ ఇండియా, ఆర్‌ఈసీ, బజాజ్‌ కార్ప్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, నైవేలీ లిగ్నయిట్‌, సిప్లా, అంబుజా సిమెంట్స్‌, ఫెడరల్‌ బ్యాంకు, టెక్స్‌మాకో రైల్‌, టాటా

Most from this category