STOCKS

News


ఇదేం గ్యాస్ ధరల విధానం..

Monday 13th January 2020
news_main1578886336.png-30874

  • భారత్‌ తీరుపై ఐఈఏ ఆక్షేపణ

న్యూఢిల్లీ: సహజ వాయువు ధర విధానానికి సంబంధించి భారత్ తీరును అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) తీవ్రంగా ఆక్షేపించింది. అంతర్జాతీయంగా అత్యంత చౌక ప్రామాణిక ధరకు దేశీ గ్యాస్‌ రేటును ముడిపెట్టడం వల్ల .. తయారీ సంస్థలు ఉత్పత్తి పెంచుదామనుకున్నా.. ప్రోత్సాహకం లేకుండా పోతోందని పేర్కొంది. పర్యావరణానికి అనుకూలమైన గ్యాస్‌ ఉత్పత్తి మరింత పెరగాలంటే.. పన్నుల విషయంలో మిగతా ఇంధనాల తరహాలోనే దీనికి కూడా సమానస్థాయి కల్పించాలని, వస్తు.. సేవల పన్నుల (జీఎస్‌టీ) పరిధిలోకి చేర్చాలని సూచించింది. భారత ఇంధన విధానాలపై అధ్యయన నివేదికలో ఐఈఏ ఈ అంశాలు పేర్కొంది. ప్రస్తుతం దేశీ ఇంధనాల్లో 6 శాతంగా ఉన్న సహజ వాయువు వాటాను 2030 నాటికల్లా 15 శాతానికి పెంచాలన్న లక్ష్యాన్ని సాధించడంలో.. ధరే ప్రధాన సవాలుగా ఉండనుందని తెలిపింది. ఇప్పుడు అమెరికా, బ్రిటన్‌, కెనడా, రష్యా వంటి ఎగుమతి దేశాల సగటు ధర ఆధారంగా దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్‌ రేటును నిర్ణయిస్తున్నారు. ఈ ఫార్ములా ప్రకారం మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్‌కు 3.23 డాలర్లుగా ధర ఉంది. దిగుమతి చేసుకుంటున్న ద్రవీకృత సహజ వాయువు ధరతో పోలిస్తే ఈ రేటు సగమే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఐఈఏ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. 



You may be interested

రిటైర్మెంట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?

Monday 13th January 2020

ప్ర: రిటైర్మెంట్‌ అవసరాల కోసం కొంత మొత్తాన్ని కూడబెట్టాలనుకుంటున్నాను. వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల రిటైర్మెంట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రిటైర్మెంట్‌ నిధిని ఏర్పాటు చేసుకుందామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ?  సతీశ్‌ బాబు, హన్మకొండ జ: రిటైర్మెంట్‌ అవసరాల కోసం రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు చేయాలనుకోవడం మంచి నిర్ణయం. అయితే ఈ ని«ధి కోసం వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల రిటైర్మెంట్‌ ఫండ్స్‌ను ఎంచుకోవడమే సరైన నిర్ణయం కాదు. రిటైర్మెంట్‌

పంట రుణాల మాఫీ రూ. 4.7 లక్షల కోట్లకు

Monday 13th January 2020

గడిచిన పదేళ్లపై ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక ముంబై:  గడిచిన పదేళ్లలో వివిధ రాష్ట్రాలు మాఫీ చేసిన వ్యవసాయ రుణాల పరిమాణం ఏకంగా రూ. 4.7 లక్షల కోట్లకు చేరింది. ఇది మొత్తం పరిశ్రమల మొండిబాకీల్లో (ఎన్‌పీఏ) దాదాపు 82 శాతం. ఎస్‌బీఐ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవస్థలో మొండిబాకీలు రూ. 8.79 లక్షల కోట్లుగా ఉండగా, వీటిలో వ్యవసాయ రంగ ఎన్‌పీఏలు

Most from this category