News


ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు రూ.5,763 కోట్లు

Wednesday 12th February 2020
news_main1581476908.png-31707

  • రూ.6,216 కోట్లకు మొత్తం ఆదాయం 
  • రూ.25,000 కోట్లకు పెరిగిన ఆధీకృత మూలధనం 

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు మరింతగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికంలో రూ.4,185 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) ఇదే క్వార్టర్‌లో రూ.5,763 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.6,191 కోట్ల నుంచి రూ.6,216 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరిన్ని వివరాలు...

దిగ్గజ బీమా సంస్థ ఎల్‌ఐసీ ప్రమోట్‌ చేస్తున్న ఐడీబీఐ బ్యాంక్‌  మొండి బకాయిలు ఈ క్యూ3లో తగ్గాయి. స్ధూల మొండి బకాయిలు స్వల్పంగా తగ్గగా, నికర మొండి బకాయిలు సగం మేర దిగివచ్చాయి. గత క్యూ3లో 29.67 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 28.72 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు కూడా 14.01 శాతం నుంచి 5.25 శాతానికి చేరాయి. విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.55,360 కోట్ల నుంచి రూ.49,503 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.21,360 కోట్ల నుంచి రూ.6,805 కోట్లకు తగ్గాయి.  


తగ్గిన కేటాయింపులు...
మొండి బకాయిలు తగ్గడంతో కేటాయింపులు కూడా తగ్గాయి. గత క్యూ3లో రూ.5,075 కోట్లుగా ఉన్న మొండి బకాయిల కేటాయింపులు ఈ క్యూ3లో రూ.440 కోట్లకు తగ్గాయి. మొత్తం కేటాయింపులు రూ.6,531 కోట్ల నుంచి రూ.522 కోట్లకు చేరాయి. కన్సాలిడేటెడ్‌ పరంగా చూస్తే, నికర నష్టాలు రూ.రూ.4,165 కోట్ల నుంచి రూ.5,729 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,244 కోట్ల నుంచి రూ.6,267 కోట్లకు పెరిగింది. గత ఏడాది డిసెంబర్‌ 31 నాటికి బ్యాంక్‌ ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 92.41 శాతంగా ఉంది.

బ్యాంక్‌ ఆధీకృత మూలధనం రూ.15,000 కోట్ల నుంచి రూ.25,000 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ వాటా 51 శాతంగా, కేంద్ర ప్రభుత్వం వాటా 47.11 శాతంగా ఉన్నాయి. 



You may be interested

సిండికేట్‌ లాభం 4 రెట్లు అప్‌

Wednesday 12th February 2020

రూ.435 కోట్లకు వృద్ధి  తగ్గిన మొండి బకాయిలు  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నాలుగు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) క్యూ3లో రూ.108 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.435 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం రూ.6,078 కోట్ల నుంచి రూ.6,317 కోట్లకు పెరిగిందని సిండికేట్‌ బ్యాంక్‌ తెలిపింది. మరిన్ని వివరాలు... పెరిగిన కేటాయింపులు... ఈ బ్యాంక్‌ మొండి బకాయిలు

భెల్‌ ఆదాయం రూ.5,828 కోట్లు

Wednesday 12th February 2020

17 శాతం తగ్గిన నికర లాభం  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ కంపెనీ భెల్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో 17 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.196 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.162 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.7,564 కోట్ల నుంచి రూ.5,828 కోట్లకు చేరిందని భెల్‌ తెలిపింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో

Most from this category