News


త్వరలో పీసీఏ నుంచి ఐడీబీఐ బ్యాంక్ బైటికి

Monday 23rd December 2019
news_main1577072141.png-30369

న్యూఢిల్లీ: భారీ మొండిబాకీల రికవరీ, మరింత మూలధనం లభించడం తదితర అంశాల ఊతంతో ఐడీబీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలోనే పీసీఏ ఆంక్షల పరిధి నుంచి బైటికి వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే రుణాల మంజూరీపరమైన కొన్ని నిబంధనలను సడలించిందని వెల్లడించాయి. భారీ మొండిబాకీలు పేరుకుపోయిన ఐడీబీఐ బ్యాంక్ వంటి బ్యాంకులను సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలోకి చేరుస్తూ ఆర్‌బీఐ నిర్దిష్ట ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఐడీబీఐ బ్యాంకు నికర ఎన్‌పీఏలపరమైన నిబంధనను గట్టెక్కింది. నిర్దేశిత 6 శాతం లోపునకు వీటిని తగ్గించుకోగలిగింది. అటు ప్రభుత్వం, ఇటు ప్రమోటరు ఎల్‌ఐసీ సుమారు రూ. 9,300 కోట్ల మూలధనం సమకూరుస్తున్నాయి. ఎస్సార్ స్టీల్‌, భూషణ్ పవర్ అండ్ స్టీల్‌, అలోక్ ఇండస్ట్రీస్‌ వంటి ఖాతాలు పరిష్కారమై.. ఐడీబీఐ బ్యాంకునకు కొన్ని మొండి బాకీలు కూడా వసూలు కానున్నాయి. ఈ పరిణామాలన్నీ బ్యాంకుపై పీసీఏపరమైన ఆంక్షల తొలగింపునకు దోహదపడగలవని సంబంధిత వర్గాలు తెలిపాయి. 



You may be interested

డబ్ల్యూఈఎఫ్‌ సదస్సుకు జోరుగా సన్నాహాలు

Monday 23rd December 2019

హాజరు కానున్న 100 పైగా భారతీయ సీఈవోలు పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా  న్యూఢిల్లీ: వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సుకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో కేంద్ర మంత్రులు పియుష్ గోయల్‌, మన్‌సుఖ్ మాండవీయతో పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు (అమరీందర్ సింగ్, కమల్‌ నాథ్‌, బీఎస్ యడ్యూరప్ప), తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు, 100 మందిపైగా భారతీయ సీఈవోలు పాల్గోనున్నారు. పారిశ్రామికవేత్తల్లో

రూ. 1.72 లక్షల కోట్ల బకాయిలు కట్టండి

Monday 23rd December 2019

గెయిల్ ఇండియాకు టెలికం విభాగం లేఖ న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సర్వీస్ లైసెన్సు (ఐఎస్‌పీ) ఫీజులు తదితర బాకీలకు సంబంధించి ఏకంగా రూ. 1.72 లక్షల కోట్లు కట్టాలంటూ ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియాకు టెలికం విభాగం లేఖ పంపింది. ఐపీ-1, ఐపీ-2, ఐఎస్‌పీ లైసెన్సు ఫీజుల బకాయిల కింద రూ. 1,72,655 కోట్లు చెల్లించాలని ఇందులో సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇప్పటికే కట్టాల్సినదంతా కట్టేశామని .. ఇక చెల్లించాల్సిన

Most from this category