News


ఐసీఐసీఐ లంబార్డ్‌  లాభం రూ.289 కోట్లు ​

Wednesday 18th July 2018
news_main1531889968.png-18417

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ లంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.289 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.214 కోట్లు నికర లాభం సాధించామని, దీంతో పోల్చితే 35 శాతం వృద్ధి సాధించామని ఐసీఐసీఐ లంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తెలిపింది. స్థూల ​‍ప్రీమియమ్‌ వసూళ్లు రూ.3,394 కోట్ల నుంచి 14 శాతం వృద్దితో రూ.3,856 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.2.50 తుది డివిడెండ్‌గా చెల్లించడానికి వాటాదారులు ఆమోదం తెలిపారని వివరించింది. గత క్యూ1లో 22.4 శాతంగా ఉన్న రిటర్న్‌ ఆన్‌ యావరేజ్‌ ఈక్విటీ(ఆర్‌ఓఏఈ) ఈ క్యూ1లో 24.7 శాతానికి పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలతాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐసీఐసీఐ లంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ షేర్‌ 3.5 శాతం లాభంతో రూ.736 వద్ద ముగిసింది. You may be interested

రూ.2174 ధరతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ-కొత్త గరిష్టస్థాయికి షేరు

Wednesday 18th July 2018

ముంబై:- అధిక ధర వద్ద ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో తన మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీకు ఈక్విటీ షేర్ల జారీకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బోర్డు ఆమోదం తెలపడంతో ఆ బ్యాంక్‌ షేర్లు బుధవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నూతన గరిష్టస్థాయిని నమోదు చేసాయి. నేడు బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు రూ.2181.60ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తన మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీకి ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ప్రతి షేరు ధర రూ. 2,174.09ల వద్ద మెత్తం 3.90

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ ​‍పైస్‌బ్యాండ్‌ రూ.1,095 -1,100

Wednesday 18th July 2018

న్యూఢిల్లీ:  హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎమ్‌సీ) ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల 25 నుంచి ఆరంభమవుతోంది. దేశంలో రెండో అతి పెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ ఈ ఐపీఓ ద్వారా రూ.2,800 కోట్లు సమీకరిస్తుందని అంచనా. రూ.5 ముఖ విలువ గల షేర్లను జారీ చేసే ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.1,095- 1,100ను కంపెనీ నిర్ణయించింది. కనీసం 13 షేర్లకు దరఖాస్తు

Most from this category