News


ఐసీఐసీఐ లాంబార్డ్‌కు రూ.308 కోట్ల లాభం

Saturday 19th October 2019
Markets_main1571459638.png-28999

న్యూఢిల్లీ:  ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.308 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.2,739 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.2,571 కోట్లు, నికర లాభం రూ.293 కోట్లతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. ఒక్కో షేరుకు రూ.3.50 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) స్థూల ప్రీమియం ఆదాయం 11.8 శాతం తగ్గి రూ.6,440 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో స్థూల ప్రీమియం ఆదాయం రూ.7,305 కోట్లుగా ఉండడం గమనార్హం. తొలి ఆరు నెలల్లో నికర లాభం 6 శాతం పెరిగి రూ.618 కోట్లుగా నమోదైంది. 



You may be interested

రివర్స్‌ గేర్‌లో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు

Saturday 19th October 2019

సెప్టెంబర్‌లో 20% తగ్గుదల న్యూఢిల్లీ: గత నెల ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) రిటైల్‌ విక్రయాలు 20.1 శాతం తగ్గినట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏడీఏ) వెల్లడించింది. సెప్టెంబర్‌ అమ్మకాలు 1,57,972 యూనిట్లు కాగా, అంతక్రితం ఏడాది ఇదేకాలంలో నమోదైన 1,97,653 యూనిట్లతో పోల్చితే ఈ మేరుకు తగ్గుదల ఉన్నట్లు వివరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పండుగల సీజన్‌ ఆఫర్లను కంపెనీలు ప్రకటించినప్పటికీ.. ఆశించిన స్థాయి ఫలితం లేకపోయిందని

ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ లాభం రూ.206 కోట్లు

Saturday 19th October 2019

8 శాతం వృద్ధి  11 శాతం పెరిగి రూ.1,402 కోట్లకు ఆదాయం న్యూఢిల్లీ: లార్సెన్‌ అండ్‌ టుబ్రో టెక్నాలజీ సర్వీసెస్‌ (ఎల్‌టీటీఎస్‌) కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.206 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ2లో ఆర్జించిన నికర లాభం రూ.191 కోట్లుతో పోల్చితే 8 శాతం వృద్ధి సాధించామని ఎల్‌టీటీఎస్‌ తెలిపింది. ఆదాయం రూ.1,266 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.1,402 కోట్లకు పెరిగిందని కంపెనీ

Most from this category