News


చందా కొచర్‌ దంపతులు మళ్లీ ఈడీ ముందుకు

Wednesday 15th May 2019
Markets_main1557901739.png-25748

  • వరుసగా రెండో రోజూ విచారణ

న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్‌లను వరుసగా రెండో రోజు మంగళవారం కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేసింది. ఉదయం 11.30 గం.ల సమయంలో వారు హాజరైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటిదాకా విచారణ ముంబైలోనే జరగ్గా ప్రస్తుతం వేదిక ఢిల్లీకి మారడం గమనార్హం. సోమవారం జరిగిన విచారణలో దాదాపు ఎనిమిది గంటల సేపు వారిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. విచారణ వివరాలు వెల్లడి కాకపోయినప్పటికీ, వీడియోకాన్ గ్రూప్‌తో వారి వ్యక్తిగత, అధికారిక లావాదేవీల గురించి ఈడీ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవోగా చందా కొచర్ బాధ్యతలు చేపట్టాక వీడియోకాన్ గ్రూప్‌నకు 2009-2011 మధ్య కాలంలో దాదాపు రూ. 1,875 కోట్ల రుణాలివ్వడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. రుణాలు పొందినందుకు ప్రతిగా దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ ధూత్‌ కొంత పెట్టుబడి పెట్టినట్లు (క్విడ్‌ ప్రో కో) అభియోగాలు ఉన్నాయి. సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో దీపక్ కొచర్‌ సోదరుడు రాజీవ్ కొచర్‌ (సింగపూర్‌కి చెందిన అవిస్టా అడ్వైజరీ వ్యవస్థాపకుడు)ను కూడా పలుమార్లు ప్రశ్నించింది. 



You may be interested

భారత్‌పై డబ్ల్యూటీఓకు జపాన్‌

Wednesday 15th May 2019

దిగుమతి సుంకాలపై వివాదాలు న్యూఢిల్లీ: కొన్ని ఉత్పత్తుల దిగుమతులపై  భారత్‌ పరిమితికి మించి సుంకాల విధిస్తోందంటూ జపాన్‌ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)ను ఆశ్రయించింది. డబ్ల్యూటీఓ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.  దీనిప్రకారం, 2014 సెప్టెంబర్‌లో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమ ప్రకటన అనంతరం ‘ఒక పద్దతి ప్రకారం, క్రమంగా’ జపాన్‌ నుంచి కొన్ని వస్తువుల దిగుమతులపై భారత్‌ సుంకాలను పెంచుతూ వస్తోంది. వీటిలో ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌,

కొన్ని ప్రధాన కంపెనీలు క్యూ4 ఫలితాలు

Wednesday 15th May 2019

రూ.1,552 కోట్ల నష్టాన్ని ప్రకటించిన యూకోబ్యాంకు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని యూకో బ్యాంకు మార్చి త్రైమాసికంలో నష్టాలను కాస్త తగ్గించుకుంది. రూ.1,552 కోట్ల నష్టాన్ని బ్యాంకు చవిచూసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంకు నికర నష్టాలు రూ.2,134 కోట్ల స్థాయిలో ఉన్నాయి. అయితే, క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ చూస్తే డిసెంబర్‌ త్రైమాసికంలో నమోదైన రూ.998 కోట్ల నష్టంతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకు ఆదాయం మాత్రం రూ.3,424 కోట్ల నుంచి రూ.4,148

Most from this category