News


కొచర్‌ దంపతులు, దూత్‌ను ప్రశ్నించిన ఈడీ

Saturday 29th June 2019
news_main1561782379.png-26680

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో అయిన చందాకొచర్‌, ఆమె భర్త దీపక్‌ కొచర్‌, వీడియోకాన్‌ గ్రూపు ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం ప్రశ్నించింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద వారిని ప్రశ్నించి సమాధానాలను అధికారులు నమోదు చేసుకున్నారు. బ్యాంకు చీఫ్‌గా ఉన్న చందాకొచర్‌ ఉన్న సమయంలో వీడియోకాన్‌ గ్రూపునకు రుణం జారీ అనంతరం ఆమె కుటుంబానికి లబ్ది కలిగినట్టు అరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చందాకొచర్‌, ఇతరుల ఆస్తుల వివరాలను దర్యాప్తు అధికారులు విశ్లేషించే పనిలో ఉన్నారు. ఆ తర్వాత మనీలాండరింగ్‌ చట్టం కింద వారి ఆస్తులను జప్తు చేయనున్నట్టు సమాచారం. ఇదే కేసులో చందాకొచర్‌ బావ రాజీవ్‌కొచర్‌ను సైతం ఈడీ ప్రశ్నించింది.



You may be interested

టాటా మోటార్స్‌కు భాగస్వామి కావాలి

Saturday 29th June 2019

టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ వ్యాఖ్య న్యూఢిల్లీ: భవిష్యత్‌ వృద్ధి కోసం టాటా మోటార్స్‌కు నూతన భాగస్వామి అవసరం ఉందని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ వ్యాఖ్యానించారు. 2018-19 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో... ఆయన వాటాదారులకు పలు వ్యూహాలను తెలియజేశారు. ‘‘జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) గడిచిన ఏడాదికాలం నుంచి సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే, వ్యయాలను తగ్గించడానికి కంపెనీకి చెందిన బ్రిటిష్ శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది.

భారత్‌ విదేశీ రుణ భారం 543 బిలియన్‌ డాలర్లు

Saturday 29th June 2019

ముంబై: భారత్‌ విదేశీ రుణ భారం 2019 మార్చి ముగిసేనాటికి 543 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఆర్‌బీఐ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీనిప్రకారం 2018 మార్చి ముగింపుతో పోల్చిచూస్తే భారత్‌ విదేశీ రుణ భారం 2.63 శాతం (13.7 బిలియన్‌ డాలర్లు) పెరిగింది. స్వల్పకాలిక, వాణిజ్య రుణాలు పెరగడం, ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) డిపాజిట్లు వంటి అంశాలను ఆర్‌బీఐ తన గణాంకాల్లో ప్రస్తావించింది. కాగా 2019 మార్చి

Most from this category