News


ఐసీఐసీఐ బ్యాంక్‌ ‘మహా లోన్ ధమాకా’

Saturday 16th November 2019
news_main1573876047.png-29631

  •  దేశవ్యాప్తంగా 2,000 లోన్‌ క్యాంప్స్‌

ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌.. తక్షణ రుణ మంజూరీ సేవలను అందించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందుకోసం ‘మహా లోన్ ధమాకా’ పేరిట ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,000 రుణ శిబిరాలను ఏర్పాటుచేయనుంది. వ్యక్తిగత, వాహన, బంగారు రుణాలతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డ్‌లను ఈ క్యాంప్స్‌ ద్వారా జారీ చేయనున్నట్లు వివరించింది. హ్యుందాయ్‌ మోటార్స్‌ వంటి కంపెనీలతో ఏర్పాటుచేసుకున్న ఒప్పందం మేరకు కస్టమర్లు కాకపోయినా.. ప్రత్యేక ఆఫర్లతో మేళా వద్ద రుణాలను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల లక్ష్యంగా ఈ క్యాంప్స్‌ ఉండనున్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుప్ బాగ్చి అన్నారు. You may be interested

ఎగుమతులు... మూడవ నెలా ‘మైనస్‌’

Saturday 16th November 2019

  అక్టోబర్‌లో 1.11 శాతం క్షీణత విలువ 26.38 బిలియన్‌ డాలర్లు వాణిజ్యలోటు 11 బిలియన్‌ డాలర్లు న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతుల్లో వరుసగా మూడవనెలా ప్రతికూలతే నమోదయ్యింది. అక్టోబర్‌లో అసలు వృద్ధిలేకపోగా -1.11 క్షీణరేటు నమోదయ్యింది. అంటే 2018 అక్టోబర్‌తో పోల్చితే 2019 అక్టోబర్‌లో ఎగుమతుల విలువ -1.11 శాతం తగ్గి, 26.38 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. పెట్రోలియం (-14.6 శాతం), తివాచీ (-17 శాతం), తోలు ఉత్పత్తులు (-7.6 శాతం), బియ్యం (-29.5 శాతం),

ఎన్‌బీఎఫ్‌సీల దివాలా ప్రక్రియకు మార్గదర్శకాలు

Saturday 16th November 2019

న్యూఢిల్లీ: బ్యాంకులు కాకుండా వ్యవస్థాగతంగా కీలకమైన ఇతరత్రా ఆర్థిక సేవల సంస్థల(ఎఫ్‌ఎస్‌పీ) దివాలా ప్రక్రియ, మూసివేతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ వీటిని నోటిఫై చేసింది. దివాలా కోడ్‌లోని సెక్షన్‌ 227 ప్రకారం.. వ్యవస్థాగతంగా ఏయే ఎఫ్‌ఎస్‌పీలు కీలకమైనవి, ఏవి ఆ పరిధిలోకి రావన్నది కేంద్ర ప్రభుత్వం కేటగిరీల వారీగా నిర్ణయిస్తుంది. ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలతో సంప్రతింపుల మేరకు సంక్షోభంలో ఉన్న ఎఫ్‌ఎస్‌పీల

Most from this category