News


ఐసీఐసీఐ బ్యాంక్‌ శాఖల విస్తరణ వేగవంతం

Tuesday 24th September 2019
news_main1569296854.png-28504

  • మార్చి 2020 నాటికి 450 చిన్న శాఖలు
  • 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు

ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ భారీ విస్తరణ ప్రణాళికలను చేపట్టింది. ప్రస్తుతం ఉన్న శాఖల్లో 10వ వంతు నూతన శాఖల ఏర్పాటుకు సిద్ధమైంది.  వచ్చే ఏడాది మార్చి నాటికి నూతనంగా 450 చిన్న శాఖలను ప్రారంభించాలని లక్ష్యంగా నిర్థేశించుకున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం నెట్‌వర్క్‌ 5,300 వద్దకు చేరుకుంటుందని సోమవారం వెల్లడించింది. శాఖల ఏర్పాటుతో నూతనంగా 3,500 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న మందగమనంతో సంబంధం లేకుండా బ్రాంచీల విస్తరణ చేపట్టనున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనూప్‌ బగ్చీ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘డీమోనిటైజేషన్, వస్తు సేవల పన్ను అమలు, పలు ప్రభుత్వ కఠిన నిబంధనల నేపథ్యంలో రియల్టీ రంగం ఇటీవలి కాలంలో బాగా ప్రభావితమైంది. దీంతో ఇన్వెంటరీ పెరిగి, అద్దెలు దిగిరావడం వంటి ప్రతికూలతలు ఈ రంగంలో కొనసాగుతున్నాయి. ఇటువంటి సమయంలో శాఖల విస్తరణ సరైన నిర్ణయంగా భావిస్తున్నాం. బ్రాంచీల ఏర్పాటుకు వ్యయం కూడా తక్కువగా ఉంది. ఇక బ్యాంక్‌ వృద్ధి పరంగా.. రెండంకెల మార్కెట్‌ వాటాకు సమీపించాం. మందగమన ప్రభావం బ్యాంక్‌పై లేదు’ అని అన్నారు. 



You may be interested

ఆపరేటర్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు..

Tuesday 24th September 2019

టెల్కోలను సులువుగా మారుస్తున్న కస్టమర్లు రెండో స్థానంలో తెలంగాణ, ఏపీ సర్కిల్‌ ఇప్పటికే ఎంఎన్‌పీ అభ్యర్థనలు 44.7 కోట్లు్ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ కోసం దేశవ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఆశించిన స్థాయిలో సేవలు అందకపోతే కస్టమర్లు మరో ఆపరేటర్‌కు సులువుగా మారుతున్నారు. 2019 జూలై 31 నాటికి 44.74 కోట్ల మంది ఎంఎన్‌పీ సేవలను వినియోగించుకున్నారంటే వినియోగదార్లలో ఉన్న చైతన్యం అర్థం చేసుకోవచ్చు. ఇలా అభ్యర్థనలు వచ్చిన

థామస్‌ కుక్‌ దివాలా

Tuesday 24th September 2019

ఆరు లక్షల మంది పర్యాటకులకు ఇబ్బంది  22 వేల ఉద్యోగాలు పోతాయ్‌- గోవా పర్యాటకంపై పెను ప్రభావం  మాది వేరే కంపెనీ థామస్‌ కుక్‌ ఇండియా స్పష్టీకరణ లండన్‌: ప్రముఖ బ్రిటిష్‌ పర్యాటక సంస్థ, థామస్‌ కుక్‌ దివాలా తీసింది. దీంతో దాదపు ఆరు లక్షల మంది పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్‌కు చెందిన లక్షన్నరకు పైగా యాత్రికులు వివిధ దేశాల్లో చిక్కుకు పోయారు. వీరందరినీ స్వదేశానికి తరలించడానికి ఇంగ్లాండ్‌ ప్రభుత్వానికి భారీగానే వ్యయం

Most from this category