News


ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.4,670 కోట్లు

Monday 27th January 2020
news_main1580092721.png-31212

(అప్‌డేటెడ్‌...)

  • రెండు రెట్లు వృద్ధి 
  • కలసివచ్చిన ఎస్సార్‌ స్టీల్‌ రుణ రివకరీ 
  • నిర్వహణ లాభం 23 శాతం అప్‌ 

ముంబైఐ ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో రెండు రెట్లు పెరిగింది. గత క్యూ3లో రూ.1,874 కోట్లుగా  ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌)ఈ క్యూ3లో రూ.4,670 కోట్లకు పెరిగిందని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. ఎస్సార్‌ స్టీల్‌ రుణాలు రికవరీ కావడం, కీలక ఆదాయం పెరగడం దీనికి కారణమని వివరించింది. స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, నికర లాభం రూ.1,605 కోట్ల నుంచి రూ.4,146 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరిన్ని వివరాలు....

నికర వడ్డీ ఆదాయం 24 శాతం అప్‌...
ఈ క్యూ3లో 16 శాతం రుణ వృద్ధి సాధించింది. నికర వడ్డీ మార్జిన్‌ 3.77 శాతానికి పెరిగింది. దీంతో నికర వడ్డీ ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.8,545 కోట్లకు పెరిగింది. ఇక ఇతర ఆదాయం 19 శాతం పెరిగి రూ.4,043 కోట్లకు చేరింది. ఫీజు ఆదాయం 17 శాతం వృద్ధి చెందింది. నిర్వహణ లాభం 23 శాతం వృద్ధితో రూ.7,017 కోట్లకు పెరిగింది. 
తగ్గిన మొండి బకాయిలు....
గత క్యూ3లో 7.75 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 5.95 శాతానికి తగ్గాయి. ఈ క్యూ3లో తాజా మొండి బకాయిలు రూ.4,363 కోట్లకు ఎగిశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధికం. అయితే ఎస్సార్‌ స్టీల్‌ రుణాలు రూ.2,000 కోట్ల మేర రికవరీ అయ్యాయి. దీంతో నికరంగా చూస్తే, తాజా మొండి బకాయిల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ఇక కేటాయింపులు 51 శాతం తగ్గి రూ.2,083 కోట్లకు చేరాయి. 



You may be interested

ఎల్‌టీసీజీ రద్దు చేయాలి ..

Monday 27th January 2020

మ్యూచువల్‌ ఫండ్స్‌ డిమాండ్‌ ఎల్‌టీసీజీ ఎత్తివేత వంటి డిమాండ్లను కేంద్రం ఈసారైనా పరిగణనలోకి తీసుకోవాలని మ్యుచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ కోరుతోంది. వీటితో దేశీ ఎంఎఫ్‌ పరిశ్రమకు తోడ్పాటు లభించడంతో పాటు ఎకానమీని పటిష్టంగా చేసేందుకు, బాండ్‌ మార్కెట్‌ మరింతగా విస్తృతి చెందేందుకు, ఇన్‌ఫ్రా వృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రాతిపదికన నిధుల లభ్యత పెరగగలదని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల సమాఖ్య యాంఫీ పేర్కొంది. అలాగే, పెట్టుబడులను భౌతికరూపంలో పసిడి నుంచి గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు

సెన్సెక్స్‌కు 41,060 మద్దతు కీలకం

Monday 27th January 2020

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ సరళతర విధానాల ఫలితంగా ఏడాదికాలంగా ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లు 20-30 శాతం వరకూ పరుగులు తీశాయి. కానీ ఆ పరుగులో వెనుకబడ్డ భారత్‌ మార్కెట్‌కు (13 శాతం ర్యాలీయే..అందులో 10 శాతం కార్పొరేట్‌ టాక్స్‌ కట్‌ ఫలితమే) కీలకమైన బడ్జెట్‌వారం వచ్చేసింది. జీడీపీ వృద్ధి క్షీణత, వినియోగ డిమాండ్‌ తగ్గుదల, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాల కారణంగా సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థను

Most from this category