News


ఐసీఐసీఐబ్యాంకు ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Saturday 25th January 2020
news_main1579926949.png-31193

మూడో త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంకు లాభం దాదాపు 200 శాతం పెరగవచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. బ్యాంకుకు చెందిన పెద్ద ఎన్‌పీఏ ఎస్సార్‌ స్టీల్‌కు సంబంధించిన బకాయిలు వసూలు కావడం లాభాలను పెంచుతుందని భావిస్తున్నారు. క్యు3లో బ్యాంకు నికర వడ్డీ ఆదాయంలో 30 శాతం వరకు పెరుగుదల ఉండొచ్చని భావిస్తున్నారు. అదేవిధంగా స్థిరమైన ఎన్‌ఐఎం, ప్రీప్రొవిజన్‌ లాభంలో 20 శాతం పెరుగుదల ఉంటాయని అంచనా వేస్తున్నారు. శనివారం బ్యాంకు ఫలితాలు విడుదల చేయనుంది. ఎస్సార్‌ స్టీల్‌ నుంచి దాదాపు రూ. 2వేల కోట్ల రికవరీ ఉందని, ఇది లాభాలను పెంచుతుందని, అదేవిధంగా డిపాజిట్‌ రేట్ల మెరుగుదలతో మార్జిన్లు మరింత విస్తరిస్తాయని, మొండి పద్దులు తగ్గడం, రిటైల్‌ రుణాలు పెరగడం ఉండొచ్చని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ భావిస్తోంది. అగ్రి, ఎన్‌బీఎఫ్‌సీ స్లిపేజ్‌ల కారణంగా స్లిపేజ్‌ల్లో పెరుగుదల ఉండొచ్చని కానీ మొండిపద్దుల రికవరీతో ఆస్తుల నాణ్యత మెరుగుపడవచ్చని తెలిపింది. టాక్సు కోతలతో బ్యాంకుకు లాభదాయకమని ప్రభుదాస్‌ లీలాధర్‌ అంచనా వేసింది. బీబీబీ కన్నా తక్కువ రేటింగ్‌ ఉన్న రుణాలు పెరగుతాయేమో చూడాలని ఎడెల్‌వీజ్‌ తెలిపింది. ఎస్సార్‌ స్టీల్‌ రుణ పరిష్కారంతో క్రెడిట్‌ కాస్ట్‌లు 1.2- 1.3 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేసింది. అల్ప రిస్కున్న రుణాలపై బ్యాంకు ఫోకస్‌ చేస్తున్నదని, ఈ నేపథ్యంలో దేశీయ క్రెడిట్‌ గ్రోత్‌ 14 శాతం, రిటైల్‌ పోర్టుఫోలియో పెరుగుదల 20 శాతం ఉండొచ్చని అభిప్రాయపడింది. 



You may be interested

ఆదాయపన్ను తగ్గింపు సాధ్యమే!

Saturday 25th January 2020

సీఎల్‌ఎస్‌ఏ అంచనా రాబోయే బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపన్నును ప్రభుత్వం తగ్గించవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. ఐటీ తగ్గింపుద్వారా వృద్ధి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం యత్నించవచ్చని పేర్కొంది. ఆదాయపన్ను తగ్గింపు కన్జూమర్‌ కంపెనీలకు మేలు చేయవచ్చని పేర్కొంది. ఆదాయపన్ను తగ్గింపుతో ఐటీ కలెక‌్షన్లు 20 శాతం(దాదాపు లక్షకోట్ల రూపాయలు) తగ్గవచ్చని అంచనా వేసింది. అయితే కొత్త ఆదాయ వర్గాలను పన్ను పరిధిలోకి తీసుకురావడం, పన్ను కట్టేవాళ్లు పెరగడంతో వసూళ్ల నిజ తగ్గింపు ఆర్థికసంవత్సరాంతానికి

రూ. 40,300పైకి పుత్తడి

Saturday 25th January 2020

మళ్లీ పెరిగిన బంగారం ధర.. గత రెండు మూడురోజులుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర శుక్రవారం మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర గత రాత్రి ప్రపంచ మార్కెట్లో1,560 నుంచి 1,575.20 గరిష్టస్థాయికి చేరింది. చివరకు గత రాత్రి న్యూయార్క్‌లో 1571 డాలర్ల వద్ద ముగిసింది. ఇదే ట్రెండ్‌ను అనుసరిస్తూ శుక్రవారం రాత్రి ఇండియాలోని ఎంసీఎక్స్‌ లో రూ.300పైగా పెరిగి 40352.00 వద్ద స్థిరపడింది. వివిధ దేశాల కరెన్సీలు బలహీనపడడం, ఇన్వెస్టర్లంతా రక్షణాత్మక

Most from this category