News


ఐసీఐసీఐ నికరలాభం రూ. 655 కోట్లు

Saturday 26th October 2019
news_main1572081898.png-29167

సెప్టెంబర్‌ త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంకు  నికరలాభం గతేడాదితో పోలిస్తే సుమారు 28 శాతం క్షీణించింది. ఈ త్రైమాసికంలో బ్యాంకు రూ. 655 కోట్ల లాభం ప్రకటించింది, గతేడాది ఇదే కాలంలో బ్యాంకు రూ. 909 కోట్ల లాభం నమోదు చేసింది. అనలిస్టులు ఈ క్యు2లో రూ. 975.6 కోట్ల లాభం అంచనా వేశారు.  ఈ త్రైమాసికంలో బ్యాంకు ఆస్తుల నాణ్యత మెరుగైంది. క్యు2లో బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు గత త్రైమాసికంలో 6.49 శాతం, గతేడాది క్యు2లో 8.54 శాతం ఉండగా, తాజాగా 6.37 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 1.77 శాతం(గత త్రైమాసికం) నుంచి 1.6 శాతానికి తగ్గాయి. గతేడాది క్యు2లో నికర ఎన్‌పీఏలు 3.65 శాతంగా ఉన్నాయి. మొత్తం మీద స్థూల ఎన్‌పీఏలు  45638 కోట్ల రూపాయలుగా, నికర ఎన్‌పీఏలు రూ. 10,916 కోట్లుగా నమోదయ్యాయి. ప్రొవిజన్లు గతేడాది క్యు2తో పోలిస్తే 37 శాతం క్షీణించి రూ. 2506 కోట్లకు దిగివచ్చాయి, గత త్రైమాసికంలో ఇవి 3496 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) రూ. 8057.4 కోట్లుగా నమోదయింది. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 25.5 శాతం అధికం. సమీక్షా కాలంలో పన్ను వ్యయాలు 3712 కోట్ల రూపాయలకు పెరిగాయి. బ్యాంకు మొత్తం వ్యయాలు 22 శాతం పెరిగి రూ. 15885 కోట్లను చేరాయి. ఇతర ఆదాయం 4,194 కోట్ల రూపాయలకు పెరిగింది. టోటల్‌ సీఏఆర్‌ నిష్పత్తి 16.14 వద్ద ఉంది. శుక్రవారం బ్యాంకు షేరు 3 శాతం పెరిగి ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయి రూ. 469 వద్ద ముగిసింది. కాగా గత రాత్రి బ్యాంకు బ్యాంక్‌ ఏడీఆర్‌ యూఎస్‌ మార్కెట్లో 2 శాతం లాభపడి 13.03 డాలర్ల వద్ద ముగిసింది. 



You may be interested

సంవత్‌ 2076 కోసం టాప్‌ 10 ముహూరత్‌ స్టాకులు!

Saturday 26th October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు గత కొన్ని సెషన్‌ నుంచి పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 11,500 పైన ట్రేడవుతుండగా, సెన్సెక్స్‌ 39,000 స్థాయికి పైన ట్రేడవుతోంది. మార్కెట్‌లో సెంటిమెంట్‌ పెరిగింది. ఇలాంటి పరిస్థితులలో సంవత్‌ 2076 కోసం ఏయూఎం క్యాపిటల్‌ టాప్‌ 10 స్టాకులను సిఫార్సు చేస్తోంది... బ్రోకరేజి: ఏయూఎం క్యాపిటల్‌ బజాజ్‌ ఆటో: ద్విచక్ర, త్రి చక్ర వాహన విభాగంలో బజాజ్‌ ఆటో కీలకమైన కంపెనీగా ఉంది. ఈ కంపెనీ 79 దేశాలలో తన

ఆరంభలాభాలు ఆవిరి: అరడాలరు లాభంతో ముగిసిన పసిడి

Saturday 26th October 2019

ఇంట్రాడేలో ఆర్జించిన లాభాలను నిలుపుకోవడంలో విఫలం కావడంతో పసిడి ధర శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో కేవలం అరడాలరు స్వల్ప లాభంతో 1,505.30 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా కన్జూ‍్యమర్‌ గణాంకాలు సెప్టెంబర్‌లో బలహీనంగా నమోదయ్యాయి. ఈ బలహీన గణాంకాలు వచ్చేవారంలో ఫెడ్‌రిజర్వ్‌తో పాటు పలు కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల తగ్గింపునకు పురిగొల్పవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వడ్డీరేట్ల తగ్గింపు అనేది పసిడి ర్యాలీకి తోడ్పాటును ప్రోత్సహించే అంశం.

Most from this category