News


రూ.20వేల కోట్ల సమీకరణకు ఐసీఐసీఐ బ్యాంకు సన్నాహాలు

Tuesday 19th November 2019
news_main1574136793.png-29696

సంస్థాగత ఇన్వెస్టర్లకు సుమారు 6-7 శాతం వాటా విక్రయించడం ద్వారా రూ.20వేల కోట్లను సమీకరించాలని ఐసీఐసీఐ బ్యాంకు యోచిస్తోంది. ఈ మేరకు దాదాపు 10 ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులను ఐసీఐసీఐ సంప్రదించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒక్క విడతలో అమ్మకం మొత్తం పూర్తి చేయాలని బ్యాంకు భావిస్తోంది. ఇందుకు విధివిధానాలను త్వరలో నిర్ధేశించుకోనుందని సదరు వర్గాలు తెలిపాయి. బ్యాంకు యోచన నిజమైతే దేశీయ కార్పొరేట్‌ చరిత్రలో అతిపెద్ద క్యాపిటల్‌ సమీకరణ కానుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభానంతరం తలెత్తిన లిక్విడిటీ సమస్యకు ఇది ఒక సమాధానమవుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు ఎన్‌బీఎఫ్‌సీల నుంచి మార్కెట్‌ వాటా కొల్లగొట్టేందుకు కూడా ఈ మూలధనం ఉపయోగపడనుంది. ఇప్పటికే పలు ప్రైవేట్‌ బ్యాంకులు క్యుఐపీ మార్గంలో మూలధన సమీకరణ చేసుకున్నాయి యస్‌బ్యాంకు త్వరలో 120 కోట్ల డాలర్లు సమీకరించనుంది. యాక్సిస్‌ బ్యాంకు గత సెప్టెంబర్‌లో రూ. 12500 కోట్లు, ఎస్‌బీఐ 2017లో రూ. 15వేల కోట్లను సమీకరించాయి. నియంత్రణాపరమైన తలనొప్పులు లేకుండా మూలధన సమీకరణకు కంపెనీలు క్యుఐపీ మార్గాన్ని అవలంబిస్తుంటాయి. 



You may be interested

పడిపోయిన రూపీ

Tuesday 19th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం సెషన్లో 7 పైసలు బలహీనపడి 71.91 వద్ద ప్రారంభమైంది. కాగా విదేశీ నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగడంతో పాటు, డాలర్‌ బలపడడంతో  గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ లాభాలను కోల్పోయి 71.84 వద్ద నెగిటివ్‌లో ముగిసింది. యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం నెమ్మదించడంతో పాటు, యుఎస్‌ చమురు నిల్వలు పెరగడంతో గత కొన్ని సెషన్‌ల నుంచి చమురు ధరలు నష్టాల్లో

ఐడియా, ఎయిర్‌టెల్‌ షేర్ల ర్యాలీ!

Tuesday 19th November 2019

టెలికాం దిగ్గజ కంపెనీలైనా వొడాఫోన్‌-ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ డిసెంబర్‌ 1 వ తేది నుంచి కాల్‌చార్జీలను పెంచాలని నిర్ణయించాయి. కాగా ఈ నిర్ణయంతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా షేరు మంగళవారం సెషన్‌లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ ఉదయం 9.38 సమయానికి 5 శాతం లాభపడి రూ. 431 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 409.20 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం సెషన్‌ ప్రారంభంలో 4.5 శాతం పెరిగి

Most from this category