News


ఐబీసీ కింద ఆర్థిక సేవల సంస్థలకూ పరిష్కారం: సాహూ

Tuesday 12th November 2019
news_main1573530932.png-29522

న్యూఢిల్లీ: దివాలా, బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ)లో ఆర్థిక సేవల సంస్థలకు సంబంధించి కూడా పరిష్కార క్లాజ్‌ ఉందన్నారు దివాలా అండ్‌ బ్యాంక్రప్టసీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) చైర్‌పర్సన్‌ ఎంఎస్‌ సాహూ. ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) అమల్లోకి వచ్చేంత వరకు ఈ నిబంధన కింద పరిష్కారాన్ని కోరవచ్చన్నారు. ఏదేనీ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ (ఆర్థిక సేవలను అందించే సంస్థ)ను దివాలా చర్యల కింద నోటిఫై చేసే అధికారాన్ని ఐబీసీలోని సెక్షన్‌ 227 ప్రభుత్వానికి కల్పిస్తోందని సాహూ వివరించారు. ఆర్థిక సేవల సంస్థల కోసం ప్రత్యేకించి కేంద్రం ఎఫ్‌ఆర్‌డీఐను తీసుకురానుంది. కనుక అది వచ్చేంత వరకు ఐబీసీ చట్టం కింద నిబంధనలను వినియోగించుకోవచ్చన్నది సాహూ అభిప్రాయంగా ఉంది. 



You may be interested

బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లాభం రూ.403 కోట్లు

Tuesday 12th November 2019

33 శాతం వృద్ధి  6 శాతం వృద్ధితో రూ.3,023 కోట్లకు నికర అమ్మకాలు  న్యూఢిల్లీ:- బ్రిటానియా ఇండస్ట్రీస్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసిక కాలంలో రూ.403 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.303 కోట్లుతో పోల్చితే 33 శాతం వృద్ధి సాధించామని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ తెలిపింది. నికర అమ్మకాలు రూ.2,855 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.3,023

బీమా పండటం లేదు

Tuesday 12th November 2019

దూరమవుతున్న బీమా కంపెనీలు ప్రకృతి విపత్తులతో భారీ నష్టాలు రీఇన్సూరెన్స్‌ చార్జీలు అధికం తప్పుకున్న ఐసీఐసీఐ లాంబార్డ్‌, చోళమండలం న్యూఢిల్లీ: పంటల బీమా (క్రాప్‌ ఇన్సూరెన్స్‌) అంటే.. బీమా కంపెనీలు భయపడిపోతున్నాయి! ప్రకృతి విపత్తుల కారణంగా పరిహారం కోరుతూ భారీగా క్లెయిమ్‌లు వస్తుండడం, ఫలితంగా ఈ విభాగంలో వస్తున్న భారీ నష్టాలతో కంపెనీలు పునరాలోచనలో పడుతున్నాయి. దీంతో ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఇప్పటికే ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం కింద

Most from this category