News


కన్సార్షియం రుణాల పంపిణీపై కార్యాచరణ

Monday 23rd December 2019
news_main1577072536.png-30371

  • ఏప్రిల్‌ నాటికి సిద్ధం చేయనున్న ఐబీఏ

న్యూఢిల్లీ: బ్యాంకులు ఒక కూటమిగా ఏర్పడి మంజూరు చేసే రుణాల విషయంలో (కన్సార్షియం లెండింగ్‌) ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కార్యాచరణను ఇండియన్‌ బ్యాం‍క్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) వచ్చే ఏప్రిల్‌ నాటికి తయారు చేయనుంది. అలాగే, బ్యాంకులకు ప్రత్యామ్నాయ నిధుల మార్గాలపైనా దృష్టి సారించనుంది. ‘‘ప్రస్తుతం కన్సార్షియంగా ఇచ్చే రుణాల విషయంలో నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) కోసం అన్ని బ్యాంకుల చుట్టూ రుణగ్రహీత తిరగాల్సి వస్తోంది. నిధులు పొందేందుకు ఆరు నెలలు లేదా ఏడాది, ఏడాదిన్నర కాలం కూడా పడుతోంది’’అని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌కు అధ్యక్షత వహిస్తున్న ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ శనివారం ఢిల్లీలో జరిగిన ఫిక్కీ వార్షిక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో నిర్ణయం తీసుకునే విధంగా కార్యాచరణ ఉండాలన్నారు. ఇందుకు పరిష్కారంగా ఐబీఏ స్థాయిలో, ఆర్‌బీఐ కూడా కార్పొరేట్ల రుణాల కోసం సెకండరీ మార్కెట్‌ను అభివృద్ధి చేయనున్నట్టు కుమార్‌ తెలిపారు. 



You may be interested

నష్టాల ప్రారంభం

Monday 23rd December 2019

హెవీవెయిట్‌ షేరు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీ నష్టంతో ప్రారంభంకావడంతో దేశీయ స్టాక్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 133 పాయింట్లు క్షీణించి 41,548 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 12,235 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. పన్నా, ముక్తా చమురు క్షేత్రానికి సంబంధించి 4.5 బిలియన్‌ డాలర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చెల్లించాల్సివుందని, ఈ నేపథ్యంలో సౌదీ ఆరామ్‌కోతో రిలయన్స్‌ డీల్‌ రద్దును కేంద్ర ప్రభుత్వం కోరడంతో

డబ్ల్యూఈఎఫ్‌ సదస్సుకు జోరుగా సన్నాహాలు

Monday 23rd December 2019

హాజరు కానున్న 100 పైగా భారతీయ సీఈవోలు పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా  న్యూఢిల్లీ: వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సుకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో కేంద్ర మంత్రులు పియుష్ గోయల్‌, మన్‌సుఖ్ మాండవీయతో పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు (అమరీందర్ సింగ్, కమల్‌ నాథ్‌, బీఎస్ యడ్యూరప్ప), తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు, 100 మందిపైగా భారతీయ సీఈవోలు పాల్గోనున్నారు. పారిశ్రామికవేత్తల్లో

Most from this category