STOCKS

News


అన్ని టెల్కోలు కొనసాగాలి.. అదే నా కోరిక!

Saturday 16th November 2019
news_main1573884865.png-29641

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
ఏ టెలికం కంపెనీ కూడా మూతపడాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని, రుణభారంతో కుదేలైన టెలికం రంగాన్ని ఆదుకోవాలనే యోచిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఏ టెల్కో మూసేయాలని తాను కోరడం లేదని, అన్ని టెల్కోలు కొనసాగాలని, కస్టమర్లకు సేవలందించాలనే తాను ఆశిస్తున్నానని ఆమె చెప్పారు. ధరల యుద్ధంతో సతమతమవుతున్న టెలికం రంగానికి తాజాఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అశనిపాతంలా తగిలింది. ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాలన్న కోర్టు తీర్పుతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాల బాలెన్స్‌ షీట్లు కకావికలయ్యాయి. ఇలాగైతే కంపెనీ దివాలా ఖాయమని వీఐఎల్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టెల్కోల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది. తాజా తీర్పును, టెల్కోల పరిస్థితులను అధ్యయనం చేసి ఈ కమిటీ ‍ప్రభుత్వానికి తగు సిఫార్సులు చేయనుంది.

మరోవైపు టెలికం సేవలపై జీఎస్‌టీనీ 18 నుంచి 12 శాతానికి తగ్గించాలన్న డిమాండ్‌పై స్పందిస్తూ ఈ విషయమై ఇంకా ఫిట్‌మెంట్‌ కమిటీ పూర్తిగా దృష్టి సారించలేదని నిర్మల చెప్పారు. ఈ విషయంపై నిర్ణయాన్ని జీఎస్‌టీ కౌన్సిల్‌ తీసుకుంటుదన్నారు. బ్యాంకు డిపాజిట్స్‌పై బీమా కవరేజ్‌ను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును శీతాకాలం సమావేశాల్లో ప్రవేశపెడతామని ఆమె చెప్పారు. సోమవారం నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఆరంభం కానున్నాయి. సంక్షేమ పథకాలపై వ్యయాలను తగ్గించే యోచనేదీ ప్రభుత్వానికి లేదని ఆమె భరోసానిచ్చారు. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేసమయానికి విత్త లక్ష్యాలన్నీ అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్‌ తీసుకునే ఆలోచనేది ఇంకా లేదన్నారు. కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు నేపథ్యంలో పెట్టుబడులు పెంచుతామని కీలకమైన కార్పొరేట్‌ లీడర్లు తనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. You may be interested

మార్కెట్లు వాస్తవాన్ని మరిచి పెరుగుతున్నాయి: సామ్కో

Saturday 16th November 2019

‘మార్కెట్‌ సెంటిమెంట్‌కు, దేశ స్థూల ఆర్థిక డేటాకు మధ్య వ్యత్యాసం అధికంగా ఉండడంతో, స్టాక్‌మార్కెట్లు దీర్ఘకాల దిద్దుబాటు దశను ఎదుర్కొనే అవకాశం ఉంది’ అని సామ్కో సెక్యురిటీస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జిమిత్‌మోదీ వ్యాఖ్యానించారు. మిగిలిన ముఖ్యంశాలు ఆయన మాటల్లో..  కార్పొరేట్‌ ఫలితాలు బాగుండడం, అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిళ్లు‍ తగ్గుముఖం పడుతుండడంతో, గత కొన్ని వారాల నుంచి దేశీయ ఈక్విటీ మార్కెట్లను పాజిటివ్‌ సెంటిమెంట్‌ నడుపుతోంది. పాజిటివ్‌ సెంటిమెంట్‌ ఎక్కువగా ఉండడంతో మార్కెట్లు

రూ.38వేల దిగువన పసిడి

Saturday 16th November 2019

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్‌ ధర శుక్రవారం రూ.38వేల దిగువన ముగిసింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ రెండోరోజూ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గడంతో దేశీయంగానూ పసిడి ధర నష్టాల బాట పట్టింది. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.272లు నష్టపోయి రూ.37994.00 వద్ద స్థిరపడింది. దేశీయంగా వారం మొత్తం మీద 10గ్రాముల పసిడి ధర రూ.307లు లాభపడింది. ట్రేడ్‌

Most from this category