News


వెలుగులోకి భారత్‌ హోటల్స్‌ రూ.1,000 కోట్ల అక్రమాస్తులు

Saturday 25th January 2020
news_main1579924501.png-31189

  • విదేశాలకు నల్లధనం తరలింపు
  • ఆదాయపన్ను సోదాల్లో గుర్తింపు

న్యూఢిల్లీ: లలిత్‌ హోటల్స్‌ బ్రాండ్‌తో ఆతిథ్య సేవల్లో ఉన్న భారత్‌ హోటల్స్‌ గ్రూపు అక్రమాల పుట్ట ఆదాయపన్ను అధికారుల సోదాలతో బయటపడింది. లెక్కల్లో చూపించిన రూ.1,000 కోట్ల ఆస్తులు, నల్లధనం విదేశాల్లో ఉన్నట్టు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. సీబీడీటీ తన ప్రకటనలో పేరును వెల్లడించలేదు కానీ, జ్యోత్స్న సూరి ఆధ్వర్యంలోని భారత్‌ హోటల్స్‌ గ్రూపునకు సంబంధించినవే ఇవని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 19న ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భారత్‌ హోటల్స్‌ గ్రూపు, సంబంధీకుల కార్యాలయాలు, ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం గమనార్హం. ఈ దర్యాప్తులో రూ.1,000 కోట్లకు పైగా లెక్కల్లో చూపించని విదేశీ ఆస్తులు, రూ.35 కోట్లకు పైగా పన్ను ఎగవేతను గుర్తించినట్టు సీబీడీటీ తెలిపింది. సదరు గ్రూపు ఆతిథ్య రంగంలో ప్రముఖ సంస్థ అని పేర్కొంది. లెక్కలు చూపించని రూ.24.93 కోట్ల ఆస్తులను, రూ.23 కోట్ల విలువైన ఆభరణాలను, రూ.1.2 కోట్ల ఖరీదైన గడియారాలను ‍సీజ్‌ చేసినట్టు వెల్లడించింది. 



You may be interested

తదుపరి దర్యాప్తు గురించి సమాచారం లేదు

Saturday 25th January 2020

ప్రజావేగు ఫిర్యాదులపై ఇన్ఫోసిస్‌ ప్రకటన న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌ కంపెనీ బ్యాలన్స్‌ షీట్లలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ కంపెనీఈ సీఈవో, సీఎఫ్‌వోలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజావేగు ఫిర్యాదులపై తదుపరి దర్యాప్తు గురించి సెబీ నుంచి తమకు ఎటువంటి సమాచారం రాలేదని కంపెనీ ప్రకటించింది. ప్రజావేగు ఫిర్యాదుపై అంతర్గతంగా ఆడిట్‌ విచారణ చేసిన ఇన్ఫోసిస్‌ ఆర్థిక అవకతవకలు, అక్రమాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవంటూ సీఈవో సలీల్‌ పరేఖ్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చేసింది. అయితే, ఈ ఫిర్యాదుపై

నవంబర్‌లో 14.33 లక్షల నూతన ఉద్యోగాలు

Saturday 25th January 2020

రూ.10,176 కోట్లకు తగ్గిన మొత్తం ఆదాయం  నిర్వహణ లాభం రూ.1,786 కోట్లు ముంబై: బిర్లా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో 80 శాతం మేర పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.396 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.712 కోట్లకు పెరిగిందని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.10,294 కోట్ల నుంచి

Most from this category