News


హ్యుందాయ్‌ కార్ల ధరలు పెంపు..!

Wednesday 11th December 2019
Markets_main1576036070.png-30168

  • జనవరి ఒకటి నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్‌ ఇండియా తన వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదలాయించే క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మోడల్‌ ఆధారంగా పెంపు ఉండనున్నట్లు చెప్పిన కంపెనీ.. ఎంత మేర ధరలు పెరగనున్నాయనే అంశాన్ని  వెల్లడించలేదు. మరోవైపు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌ కూడా తమ వాహన ధరలను జనవరి ఒకటి నుంచి పెంచనున్నట్లు ప్రకటించడం తెలిసిందే. తాజాగా ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ కూడా తన వాహనాల ధరల్లో పెంపు ఉండనున్నట్లు ప్రకటించింది. 



You may be interested

వొడాఫోన్‌ఐడియా ఆస్తుల విక్రయ సన్నాహాలు!

Wednesday 11th December 2019

ఆప్టిక్‌ ఫైబర్‌ వ్యాపారాన్ని విక్రయించేందుకు బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌తో, డేటా సెంటర్‌ను విక్రయించేందుకు ఎడెల్‌వీజ్‌ గ్రూప్‌తో వొడాఫోన్‌ఐడియా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఏజీఆర్‌ తదితర బకాయిలను జనవరి కల్లా చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో కంపెనీ 250 కోట్ల డాలర్లను సమీకరించాల్సి ఉంది. ఇందుకోసం వివిధ అసెట్స్‌ను విక్రయించేందుకు నిర్ణయించింద. బ్రూక్‌ఫీల్డ్‌కు 156000 కిలోమీటర్ల ఆప్టిక్‌ ఫైబర్‌ విక్రయానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, ఇందుకు బోఫాఎంఎల్‌, మోర్గాన్‌స్టాన్లీ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయని సంబంధిత

స్వల్ప లాభాలతో ప్రారంభం

Wednesday 11th December 2019

ట్రేడ్‌ డీల్‌ కుదరనిపక్షంలో డిసెంబర్‌ 15 నుంచి చైనా దిగుమతులపై టారీఫ్‌ పెంపును అమెరికా వాయిదా వేయవచ్చన్న వార్తలతో బుధవారం ఆసియా మార్కెట్లు స్థిరంగా ట్రేడవుతున్న నేపథ్యంలో భారత్‌ స్టాక్‌ సూచీలు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 45 పాయింట్ల లాభంతో 40,285 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10 పాయింట్ల పెరుగుదలతో 11,867 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

Most from this category