News


డిజిటల్‌ లావాదేవీల్లో హైదరాబాద్‌ సెకండ్‌

Thursday 17th October 2019
news_main1571284467.png-28937

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిజిటల్‌ లావాదేవీల్లో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని, రాష్ట్రాల వారీగా జాబితా చూస్తే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు తర్వాత తెలంగాణ ఐదో స్థానంలో ఉందని రేజర్‌పే సీటీఓ అండ్‌ కో–ఫౌండర్‌ శశాంక్‌ కుమార్‌ తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, పాల్వంచ నుంచి లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారమిక్కడ రేజర్‌ పే మూడవ ఎడిషన్‌ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత త్రైమాసికంతో పోలిస్తే హైదరాబాద్‌లో ఈ త్రైమాసికంలో కార్డుల వినియోగం 11 శాతం తగ్గిందని, యూపీఐ లావాదేవీలు 58 శాతం వృద్ధి చెందాయని తెలిపారు. ఆన్‌లైన్‌ లావాదేవీల్లో ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్, యూటిలిటీస్‌ విభాగాలు 51 శాతం వాటాను కలిగి ఉందని పేర్కొన్నారు. జొమోటొ, బుక్‌మై షో, ఎయిర్‌టెల్‌ వంటి 6 లక్షల వ్యాపారస్తులు తమ సేవలను వినియోగించుకుంటున్నారని, 2020 నాటికి 10 లక్షలను లక్ష్యించామని తెలిపారు. బ్యాంక్‌లు, ఫిన్‌టెక్‌ కంపెనీల మధ్య తగినంత సహకారం లేదని, డిజిటల్‌ పేమెంట్స్‌లో రాయితీలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు రేజర్‌పేలో టైగర్‌ గ్లోబల్, మ్యాట్రిక్స్‌ పార్టనర్స్, సికోయా ఇండియా వంటి ఇన్వెస్టర్లు 106.5 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. 



You may be interested

ద్రవ్యలోటును అదుపులో ఉంచాలి!

Thursday 17th October 2019

ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపీనాథ్‌ వాషింగ్టన్‌: ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు సంబంధించి నికర వ్యత్యాసం ద్రవ్యలోటును భారత్‌ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపీనాథ్‌ సూచించారు. అయితే దేశ ఆదాయ అంచనాలు కొంత సానుకూలంగానే ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. 2018లో భారత్‌ వృద్ధి రేటు 6.8 శాతం అయితే, 2019లో 6.1 శాతంగానే ఉంటుందని, 2020లో 7 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్‌ మంగళవారం

వరల్డ్ స్టీల్ వైస్‌ చైర్మన్‌గా సజ్జన్‌ జిందాల్‌

Thursday 17th October 2019

న్యూఢిల్లీ: ప్రపంచ ఉక్కు సంఘం (వరల్డ్ స్టీల్ అసోసియేషన్) వైస్‌ చైర్మన్‌గా జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ చైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ సజ్జన్‌ జిందాల్‌ ఎన్నికయ్యారు. ఈయన పదవీకాలం ఇక్కడ నుంచి ఏడాది పాటు కొనసాగుతుంది. ఇక మెక్సికోలోని మాంటెర్రీలో జరిగిన వరల్డ్ స్టీల్ జనరల్ అసెంబ్లీలో ఈయనతో పాటు టాటా స్టీల్ సీఈఓ, ఎండీ టీ.వీ నరేంద్రన్.. ఆర్సెలర్ మిట్టల్ చీఫ్ ఎల్.ఎన్ మిట్టల్ సభ్యులుగా నియమితులయ్యారు. 

Most from this category