News


హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,631 కోట్లు

Saturday 1st February 2020
news_main1580533619.png-31391

  • 13 శాతం వృద్ధి 
  • 4 శాతం వృద్ధితో రూ.9,953 కోట్లకు నికర అమ్మకాలు 

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలివర్‌(హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో రూ.1,631 కోట్ల​ నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.1,444 కోట్లుతో పోల్చితే 13 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. మార్జిన్లు మెరుగుపడటం, అమ్మకాల వృద్ధి కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ సంజీవ్‌ మెహతా వివరించారు.  నికర అమ్మకాలు రూ.9,582 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.9,953 కోట్లకు పెరిగాయని వివరించింది. ఈ క్యూ3లో గ్రామీణ మార్కెట్లలో మందగమనం బాగా ఉందని, వినియోగదారుల కొనుగోళ్లు బాగా తగ్గాయని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, తమ బ్రాండ్ల దన్నుతో మంచి ఫలితాలు సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు.

దేశీయ అమ్మకాలు 4 శాతం, మొత్తం అమ్మకాలు 5 శాతం చొప్పున వృద్ది చెందాయి. గత క్యూ3లో రూ.7,900 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు రూ.7,849 కోట్లకు తగ్గాయి. హోమ్‌కేర్‌ సెగ్మెంట్‌ ఆదాయం 10 శాతం పెరిగి రూ.3,147 కోట్లకు, బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ సెగ్మెంట్‌ ఆదాయం 3 శాతం తగ్గి రూ.4,448 కోట్లకు, ఫూడ్స్‌ అండ్‌ రిఫ్రెష్‌మెంట్‌ సెగ్మెంట్‌ ఆదాయం 8 శాతం వృద్ధితో రూ.1,865 కోట్లకు పెరిగాయి. స్వతంత్ర డైరెక్టర్‌గా ఆశీష్‌ శరద్‌ గుప్తా నియామకానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. You may be interested

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభం రూ.138 కోట్లు

Saturday 1st February 2020

గత క్యూ3లో రూ.4,644 కోట్ల నష్టాలు  రూ.13,431 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.138 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.4,644 కోట్ల నికర నష్టాలు వచ్చాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.11,791 కోట్ల నుంచి రూ.13,431 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.9,202 కోట్ల నుంచి

వేదాంత లాభం 49 శాతం అప్‌

Saturday 1st February 2020

న్యూఢిల్లీ: వేదాంత కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 49 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,574 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.2,348 కోట్లకు పెరిగిందని వేదాంత కంపెనీ సీఈఓ శ్రీనివాసన్‌ వెంకటకృష్ణన్‌ వెల్లడించారు. ఆదాయం మాత్రం రూ.25,067 కోట్ల నుంచి రూ.22,007 కోట్లకు తగ్గిందని తెలిపారు. వ్యయాలు కూడా రూ.21,589 కోట్ల నుంచి రూ.18,369 కోట్లకు

Most from this category