News


హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,795 కోట్లు

Wednesday 24th July 2019
news_main1563950443.png-27272

  • 14 శాతం వృద్ధి
  • 6 శాతం వృద్ధితో రూ.10,197 కోట్లకు నికర అమ్మకాలు 

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలివర్‌(హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.1,795 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.1,569 కోట్లతో పోల్చితే 14 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. అమ్మకాలు పెరగడం, మార్జిన్ల మెరుగుదల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని హెచ్‌యూఎల్‌ సీఎమ్‌డీ సంజీవ్‌ మెహతా తెలిపారు. నికర అమ్మకాలు రూ.9,616 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.10,197 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.7,604 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.7,896 కోట్లకు పెరిగాయని వివరించారు. 

విభాగాల వారీగా చూస్తే, హోమ్‌ కేర్‌ సెగ్మెంట్‌ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.3,464 కోట్లకు, బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ విభాగం ఆదాయం 4 శాతం వృద్ధివతో రూ.4,626 కోట్లకు, ఫుడ్స్‌ అండ్‌ రిఫ్రెష్‌మెంట్‌ విభాగం 9 శాతం లాభంతో రూ.1,950  కోట్లకు పెరిగాయని రామన్‌ వివరించారు. 

మెరుగుపడిన మార్జిన్లు...
మార్కెట్‌ వృద్ధి మధ్యస్థంగా ఉన్నప్పటికీ, మంచి ఆర్థిక ఫలితాలు సాధించామని హెచ్‌యూఎల్‌ సీఎమ్‌డీ సంజీవ్‌ మెహతా సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని, పటిష్టమైన నియంత్రణ పద్ధతుల కారణంగా మార్జిన్లు పెరిగాయని పేర్కొన్నారు.  గ్రామీణ ప్రాంతాలపై కేంద్రం అధికంగా ఖర్చు చేయనుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పెరగనున్నదని, మొత్తం మీద వినియోగం పుంజుకోగలదని వివరించారు. జీఎస్‌కే కన్సూమర్స్‌ హెల్త్‌కేర్‌ను హెచ్‌యూఎల్‌లో విలీనం చేయడానికి వాటాదారులు ఆమోదం తెలిపారని, ఈ ఏడాది చివరికల్లా ఈ విలీనం పూర్తవ్వగలదని పేర్కొన్నారు. You may be interested

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.1,473 కోట్లు

Wednesday 24th July 2019

21 శాతం వృద్ధి రూ.29,636 కోట్లకు నికర అమ్మకాలు  రూ.2.9 లక్షల కోట్లకు ఆర్డర్‌ బుక్‌  న్యూఢిల్లీ: ఇంజినీరింగ్‌ దిగ్గజం, ఎల్‌ అండ్‌ టీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,473 కోట్ల నికర లాభం(కన్సాలిటేడెట్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.1,215 కోట్లతో పోల్చితే 21 శాతం వృద్ధి సాధించామని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. నికర అమ్మకాలు 27,005 కోట్ల నుంచి

జగన్‌! మీరు యువతకు స్ఫూర్తి

Wednesday 24th July 2019

షావొమి ఎండీ మను జైన్‌ ట్వీట్‌ ‘‘జగన్‌ గారూ!! నేటి యువతకు మీరో స్ఫూర్తి. రాష్ట్రానికి సంబంధించి మీ విజన్‌ను పూర్తిగా విన్నాక నాలో చాలా ఉత్తేజం కలిగింది. ఇదో అద్భుతమైన సమావేశం’’ అంటూ మొబైల్‌ దిగ్గజం షావొమి గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కంపెనీ ఇండియా ఎండీ మనుకుమార్‌ జైన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. సోమవారం ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఏపీలో మరో ప్లాంటు ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచిన

Most from this category