హెచ్‌యూఎల్ లాభం రూ.1,848 కోట్లు
By Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1,848 కోట్ల నికర లాభం(స్టాండ్అలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ2లో ఆర్జించిన నికర లాభం(రూ.1,525 కోట్లు)తో పోల్చితే 21 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్ తెలిపింది. గృహ సంరక్షణ, సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ విభాగాల ఉత్పత్తుల జోరు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ సంజీవ్ మెహతా చెప్పారు. గత క్యూ2లో రూ.9,138 కోట్లుగా ఉన్న మొత్తం అమ్మకాలు ఈ క్యూ2లో రూ.9,708 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.11 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారు. డిమాండ్ సమస్యలు కొనసాగుతాయ్.... గృహ సంరక్షణ విభాగం ఆదాయం గత క్యూ2లో రూ.3,080 కోట్లు ఉండగా, ఈ క్యూ2లో రూ.3,371 కోట్లకు పెరిగిందని మోహతా చెప్పారు. సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ విభాగం ఆదాయం రూ.4,316 కోట్ల నుంచి రూ.4,543 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆహార, రిఫ్రెష్మెంట్ విభాగం ఆదాయం 8 శాం వృద్ధితో రూ.1,847 కోట్లకు చేరిందన్నారు. విల్లెమ్ ఉజేన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ-సప్లై చెయిన్)గా నియమించామని వివరించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆయన కంపెనీ డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతారని పేర్కొన్నారు.
ఈ క్యూ2లో నిర్వహణ లాభం 21 శాతం వృద్దితో రూ.2,443 కోట్లకు పెరిగిందని మెహతా పేర్కొన్నారు. గత క్యూ2లో 23.7 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్ ఈ క్యూ2లో 24.8 శాతానికి పెరిగిందని తెలిపారు. ఆర్థిక మందగమన కాలంలోనూ మంచి వృద్ది సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. మార్జిన్లు నిలకడగా మెరుగుపడుతున్నాయని వివరించారు. సమీప భవిష్యత్తులో డిమాండ్ పరంగా సమస్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
You may be interested
అదానీ గ్యాస్‌లోకి ‘టోటల్’
Tuesday 15th October 201937.4 శాతం కొనుగోలు చేసిన ఫ్రాన్స్ ఇంధన దిగ్గజం డీల్ విలువ రూ. 5,700 కోట్లు న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కి చెందిన ఇంధన రంగ దిగ్గజం టోటల్ ఎస్ఏ తాజాగా దేశీ దిగ్గజ సంస్థ అదానీ గ్యాస్‌లో 37.4 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 5,700 కోట్లు ఉండవచ్చని అంచనా. రిటైల్ స్థాయిలో వాహనాలకు గ్యాస్ విక్రయించడానికి దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 68 పట్టణాల్లో 1,500 సీఎన్జీ
5జీ వేలం ఈ ఏడాదే..
Tuesday 15th October 2019స్పెక్ట్రం ధరల్లో సంస్కరణలు తీసుకొస్తాం... టెల్కోలకు మంత్రి రవి శంకర్ ప్రసాద్ భరోసా ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ప్రారంభం న్యూఢిల్లీ: 5జీ టెలికం సేవలకు అవసరమైన స్పెక్ట్రం వేలాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిర్వహించనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. స్పెక్ట్రం ధరలకు సంబంధించి సంస్కరణలు ఉంటాయని టెలికం పరిశ్రమకు హామీ ఇచ్చారు. సోమవారం ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2019 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ