STOCKS

News


‘మౌలికం’ కీలకం!   

Sunday 2nd February 2020
news_main1580618013.png-31427

- రవాణా రంగంలో మౌలిక సదుపాయాలు, హైవేల అభివృద్ధికి రూ.1.70 లక్షల కోట్లు
- పురోగతిలో 6,500 ప్రాజెక్టులు
- పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మరిన్ని తేజాస్‌ రైళ్లు

- ‘ఉడాన్‌’ ద్వారా 2024 నాటికి వంద ఎయిర్‌పోర్టుల అభివృద్ధి  న్యూఢిల్లీ: దేశ ఆర్థిక అభివృద్ధికి చోదకశక్తి లాంటి మౌలిక వసతుల రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే రూ.103 లక్షల కోట్లతో పలు ప్రాజెక్టులను ప్రారంభించిందని, తాజాగా రవాణా రంగంలో మౌలిక వసతులు, హైవేలను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్‌లో రూ.1.70 లక్షల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పౌరుల జీవనాన్ని సులభతరం చేసేందుకు 6,500 మౌలిక వసతుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. మౌలిక వసతుల రంగంలో ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లకుపైగా వెచ్చిస్తామని ప్రధాని గతేడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చెప్పారని గుర్తు చేశారు. జాతీయ మౌలిక వసతుల పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ) కోసం ఇప్పటికే రూ.20 వేల కోట్లు కేటాయించామన్నారు.

2023కి ఢిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే
నిర్మాణం, నిర్వహణ రంగాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు. త్వరలోనే జాతీయ సరుకు రవాణా విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. 2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేతోపాటు మరో రెండు ప్యాకేజీలు పూర్తవుతాయన్నారు. చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రహదారి పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. 27,000 కి.మీ మేర విద్యుదీకరణను పూర్తి చేసే దిశగా రైల్వేలు కృష్టి చేస్తున్నాయని చెప్పారు. ‘రహదారుల నిర్మాణంలో వేగం గణనీయంగా పెరిగింది. 2015-16లో రోజుకు 17 కి.మీ మాత్రమే రోడ్ల నిర్మాణం జరగగా 2018-19 నాటికి ఇది 29.7 ​కి.మీ.కి పెరిగింది’అని ఆర్థిక మంత్రి తెలిపారు. బడ్జెట్‌లో మౌలిక వసతులకు పెద్దపీట వేయడంతో గృహ నిర్మాణం, చౌకగా పరిశుద్ధమైన ఇంధనం, ఆరోగ్యం, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్‌ టెర్మినళ్లు, మెట్రో, రైల్వే రవాణా, గిడ్డంగులు, సాగునీటి ప్రాజెక్టులు తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతం కానున్నాయి. 

ఉపాధి అవకాశాలు విస్తృతం: గడ్కారీ
మౌలిక వసతుల రంగానికి ఈ బడ్జెట్‌ గట్టి ఊతం ఇచ్చిందని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌ పారిశ్రామిక అభివృద్ధికి జవసత్వాలు కల్పించి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, తద్వారా 2 కోట్లకుపైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. 

బడ్జెట్‌లో ‘మౌలిక’వరాలు...
- పర్యాటక ప్రాంతాలను అనుసంధానించేలా మరిన్ని తేజాస్‌ రైళ్లు.
- ముంబై-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైళ్లపై చురుగ్గా పరిశీలన. 
- ‘ఉడాన్‌’పథకం ద్వారా 2024 నాటికి మరో వంద విమానాశ్రయాల అభివృద్ధి. 
- ఇంధనం, పునరుత్పాదక వనరులకు బడ్జెట్‌లో రూ.22,000 కోట్లు 
- మౌలిక వసతుల రంగాన్ని బలోపేతం చేసేందుకు 9,000 కి.మీ మేర ఆర్థిక కారిడార్‌ ఏర్పాటు. 
- 2,000 కి.మీ మేర తీర ప్రాంత రహదారులు, హైవేల అభివృద్ధి. 



You may be interested

పెరిగిన ద్రవ్యలోటు లక్ష్యం

Sunday 2nd February 2020

3.3 శాతం నుంచి 3.8 శాతానికి పెంపు ఆదాయలేమి నేపథ్యం న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు లక్ష్యం పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు 3.3 శాతంగా ఉండాలన్నది గత బడ్జెట్‌ లక్ష్యం. అయితే ఈ లక్ష్యాన్ని తాజా బడ్జెట్‌ (2020-21) 3.8 శాతానికి పెంచింది. ఆదాయాలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం.  2020 మార్చి నాటికి ద్రవ్యలోటు రూ. 7,03,760 కోట్లు ఉండాలన్నది

ఎగుమతిదారులకు ప్రత్యేక పథకం

Sunday 2nd February 2020

పన్నులు, సుంకాల రీయింబర్స్‌మెంట్‌ న్యూఢిల్లీ:  మందగించిన ఎగుమతులకు ఊతమిచ్చే దిశగా బడ్జెట్‌లో కేంద్రం చర్యలు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల స్థాయుల్లో ఎగుమతిదారులు చెల్లించే వివిధ సుంకాలు, పన్నులను రీయింబర్స్ చేసేందుకు ఈ ఏడాది ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. విలువ ఆధారిత పన్నులు (వ్యాట్‌), విద్యుత్ సుంకాలు, రవాణా కోసం ఉపయోగించే ఇంధనాల వ్యయాలు మొదలైనవి వీటిలో ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి వాటికి మినహాయింపులు గానీ రీఫండ్‌ గానీ

Most from this category