News


నో బ్యాక్‌ డోర్‌ ఒప్పందానికి సిద్ధం: హువావే

Tuesday 25th June 2019
news_main1561438283.png-26547

  • ఇతర ఓఈఎంలు ముందుకు రావాలని పిలుపు
  • భారత్‌లో మరిన్ని పెట్టుబడులకు సిద్ధమని ప్రకటన


న్యూఢిల్లీ: భారత ప్రభుత్వంతో ‘నో బ్యాక్‌ డోర్‌’ ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనాకు చెందిన టెలికం ఎక్విప్‌మెంట్‌ తయారీ దిగ్గజం హువావే ప్రకటించింది. అలాగే, ఇతర కంపెనీలు కూడా దీన్ని అనుసరించాలని సూచించింది. గూఢచర్యాన్ని నిరుత్సాహపరిచేందుకు ఈ ప్రతిపాదన చేసింది. అమెరికా ప్రభుత్వం హువావే హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ సరఫరాలపై నిషేధం విధించిన నేపథ్యంలో మన దేశంలోనూ ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ‘‘నో బ్యాక్‌ డోర్‌ అనే ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉ‍న్నామని భారత ‍ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నాం. ఇతర ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీదారులు (ఓఈఎం) సైతం ఈ తరహా ఒప్పందాన్ని ప్రభుత్వంతో, టెలికం ఆపరేటర్లతో చేసుకుంటే ‍ప్రోత్సహిస్తాం’’ అని హువావే ఇండియా సీఈవో జేచెన్‌ తెలియజేశారు. టెక్నాలజీ ఉత్పత్తుల్లో బ్యాక్‌ డోర్‌ అంటే... ప్రభుత్వంతోనో లేదా మరో పక్షంతోనో కస్టమర్ల డేటాను అనధికారిక విధానంలో, హాని తలపెట్టే ఉద్దేశంతో పంచుకోవడంగా చెబుతారు. టెలికం ఆపరేటర్లు హానికారక సాఫ్ట్‌వేర్‌లు లేదా బగ్‌ల నుంచి రక్షణ కోసం గాను సర్టిఫై చేసిన ఎక్విప్‌మెంట్‌లు, పరికరాలనే వినియోగించాలని టెలికం శాఖ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాలను కూడా ప్రతిపాదించింది. అమెరికా నిషేధం తమపై పెద్దగా ప్రభావం చూపలేదని, అమెరికా కాకుండా ఇతర దేశాల నుంచి విడిభాగాలను సమకూర్చుకోవడాన్ని ప్రారంభించామని జేచెన్‌ తెలిపారు.
స్టార్టప్‌లతో కలసి పనిచేస్తాం... 
2011లో విడుదల చేసిన భద్రతా నిబంధనలు కేవలం 4జీ నెట్‌వర్క్‌కు ఉద్దేశించినవని, వీటిని 5జీ నెట్‌వర్క్‌లకూ అప్‌గ్రేడ్‌ చేయాలని జేచెన్‌ సూచించారు. 5జీ సేవలపై పరీక్షలకు వొడాఫోన్‌ ఐడియాతో హువావే జట్టు కట్టగా, దీనికింకా ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ‘‘భారత్‌లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నాం. భారత ప్రభుత్వం తప్పకుండా పరీక్షల కోసం స్పెక్ట్రమ్‌ కేటాయిస్తుందని భావిస్తు‍న్నాం’’ అని చెప్పారు. భారత్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి హువావే సిద్ధంగా ఉందని జేచెన్‌ తెలిపారు. అలాగే, భారత స్టార్టప్‌లతో కలసి ప్రపంచానికి కావాల్సిన ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. You may be interested

మేలో మారుతీ సుజుకీ హవా

Tuesday 25th June 2019

టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ కార్లలో 8 మారుతీవే.. న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) మేనెల విక్రయాల్లో దూసుకుపోయింది. ఇతర కంపెనీల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయినప్పటికీ.. పలు మారుతీ మోడళ్లు మాత్రం రికార్డు స్థాయి విక్రయాలను కొనసాగించాయి. భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. గతనెల్లో నమోదైన టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ కార్ల జాబితాలో 8 మారుతీవే ఉన్నాయి.

వ్యక్తిగత కారణాలు... ఇక సెలవు!

Tuesday 25th June 2019

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా విరాల్‌ ఆచార్య రాజీనామా ఆరు నెలల ముందుగానే బాధ్యతల విరమణ  వ్యక్తిగత కారణాలవల్లేనని స్పష్టీకరణ కేంద్రంతో విబేధాలే కారణమన్న పుకార్లు న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా డాక్టర్‌ విరాల్‌ ఆచార్య రాజీనామా చేశారు. తన మూడు సంవత్సరాల పదవీకాలం ఇంకో ఆరు నెలలు ఉండగానే ఆయన తన బాధ్యతలను విరమించారు. వ్యక్తిగత కారణాలే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు.  ఇదే కారణంగా చూపుతూ ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజీనామా చేసిన

Most from this category