News


హువావే ‘మేట్‌ 30’ సిరీస్‌ ఆవిష్కరణ

Friday 20th September 2019
news_main1568954527.png-28447

  • తొలి సెకండ్‌ జనరేషన్‌ ‘5జీ’ స్మార్ట్‌ఫోన్‌ 

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘హువావే’ తన అధునాతన ‘మేట్‌ 30’ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను గురువారం ఆవిష్కరించింది. ‘మేట్‌ 30’, ‘మేట్‌ 30 ప్రో’ పేరిట తొలి సెకండ్‌ జనరేషన్‌ ‘5జీ’ స్మార్ట్‌ఫోన్లను పరిచయంచేసింది. వీటిలో గూగుల్‌ లైసెన్స్ పొందిన యాప్స్‌ అయిన మ్యాప్స్, జీ మెయిల్‌, యూట్యూబ్‌ లేవని ప్రకటించింది. కిరిన్ 990 ప్రాసెసర్ ఆధారంగా ఇవి పనిచేస్తాయి. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కలిగిన మేట్‌ 30 స్మార్ట్‌ఫోన్‌.. 6.62 అంగుళాల డిస్‌ప్లే, 4200 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర 799 యూరోలుగా ప్రకటించింది. ‘మేట్‌ 30 ప్రో’ ధర 1,199 యూరోలుగా నిర్ణయించింది. 



You may be interested

​‍ట్రావెల్‌ బిజినెస్‌లో రూ.250 కోట్లు

Friday 20th September 2019

ఇన్వెస్ట్‌  చేస్తున్న పేటీఎమ్‌  ఈ ఆర్థిక సంవత్సరంలో వంద శాతం వృద్ది  న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల కంపెనీ పేటీఎమ్‌ తన ట్రావెల్‌ బిజినెస్‌లో రూ.250 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నది. రానున్న ఆరు నెలల్లో ఈ పెట్టుబడులు పెడతామని పేటీఎమ్‌ తెలిపింది. పర్యాటక వ్యాపార విస్తృతిని పెంచుకోవడానికి, టెక్నాలజీని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ పెట్టుబడులను వినియోగిస్తామని పేటీఎమ్‌ ట్రావెల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభిషేక్‌ రాజన్‌ చెప్పారు. అంతే కాకుండా మార్కెట్‌ వాటా

పన్ను రేట్ల కోత?

Friday 20th September 2019

నేడు జీఎస్‌టీ మండలి కీలక సమావేశం న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి 37వ కీలక సమావేశం శుక్రవారం గోవాలో జరగనుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో... పన్నులు తగ్గించాలని, తద్వారా వ్యవస్థలో డిమాండ్‌ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని పలు పారిశ్రామిక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ కీలక జీఎస్‌టీ సమావేశం జరగనుంది. పన్నుల తగ్గింపుపై ఈ సమావేశం ఒక నిర్ణయం తీసుకోనుందని కూడా సమాచారం. ఆర్థికశాఖ మంత్రి

Most from this category