News


ఆశాజనకంగా భారత కంపెనీల వృద్ధి రేటు

Thursday 27th June 2019
news_main1561621573.png-26622

  • - హెచ్‌ఎస్‌బీసీ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: అభివృద్దిపై ఆశాజనకంగా ఉన్న కంపెనీల జాబితా పరంగా భారత్‌ రెండవ స్థానంలో ఉంది. ప్రతి పది కంపెనీల్లోని తొమ్మిది కంపెనీలు అత్యంత ఆశావాద దృక్పథంతో ఉన్నట్లు హెచ్‌ఎస్‌బీసీ తాజా నివేదికలో పేర్కొంది. ఈ అంశంలో ఇండోనేషియా మొదటి స్థానంలో ఉండగా.. ఆ తరువాత స్థానంలో భారత్‌ ఉన్నట్లు తెలిపింది. గతేడాదిలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టస్థాయికి పడిపోయి 6.8 శాతం వద్ద నిలిచిన సంగతి తెలిసిందే కాగా, భవిష్యత్తుపై కంపెనీల అంచనాలను తెలుసుకోవడంలో భాగంగా ఈ సర్వేను నిర్వహించినట్లు హెచ్‌ఎస్‌బీసీ వెల్లడించింది. ‘దేశ ఆర్థిక వ్యవస్థలో ఇమిడి ఉన్న దృడత్వం, ఇక్కడి జనాభా సామర్థ్యం వృద్ధికి బహుళ అవకాశాలను ఇస్తోంది. నూతన ఆవిష్కరణతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా తరువాత దశ అభివృద్ధికి అవకాశం ఉంది’ అని భావిస్తున్నట్లు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కమర్షియల్ బ్యాంకింగ్ హెడ్ రజత్ వర్మ అన్నారు. 



You may be interested

స్టెర్లింగ్ బయోటెక్ ఆస్తుల జప్తు

Thursday 27th June 2019

న్యూఢిల్లీ: బ్యాంకు రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న గుజరాత్ సంస్థ స్టెర్లింగ్ బయోటెక్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. వీటి విలువ సుమారు రూ. 9,778 కోట్లు ఉంటుంది. జప్తు చేసిన వాటిలో ఓడలు, బిజినెస్ జెట్‌ విమానం, నైజీరియాలోని ఆయిల్ రిగ్గులు, లండన్‌లోని విలాసవంతమైన ఫ్లాట్ మొదలైనవి ఉన్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వీటి జప్తునకు సంబంధించి ప్రొవిజనల్‌ ఆర్డరు జారీ

ఇదే సరైన సమయం

Thursday 27th June 2019

బహుళ జాతి సంస్థలను భారత్ ఆకర్షించవచ్చు అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంపై పనగరియా వ్యాఖ్యలు న్యూయార్క్‌: అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధ పరిస్థితులను భారత్ తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పనగరియా అభిప్రాయపడ్డారు. చైనా కాకుండా ఇతరత్రా దేశాల్లో కార్యకలాపాలు విస్తరించాలనుకుంటున్న భారీ బహుళ జాతి సంస్థలను (ఎంఎన్‌సీ) ఆకర్షించేందుకు ఇది అనువైన సమయమని ఆయన వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొన్న

Most from this category