News


హెచ్‌డీఎఫ్‌సీ టార్గెట్‌ రేటింగ్‌ను పెంచిన హెచ్‌ఎస్‌బీసీ

Saturday 15th June 2019
news_main1560585919.png-26322

 మార్కెట్‌ వాటాను పెంచుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీకి మంచి అవకాశం
నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సెక్టార్‌లో మందగమనమే కారణం: హెచ్‌ఎస్‌బీసీ

హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌(హచ్‌డీఎఫ్‌సీ) టార్గెట్‌ ధరను హాంకాంగ్‌, షాంఘై బ్యాంకింగ్‌ కార్పోరేషన్‌(హెచ్‌ఎస్‌బీసీ) రూ.2,195 నుంచి రూ. 2,500కు పెంచింది. ఇప్పుడున్న అనిశ్చితి పరిస్థితుల్లో కూడా హెచ్‌డీఎఫ్‌సీకి  మార్కెట్‌ షేరును పెంచుకునే సామర్ధ్యం ఉందని హెచ్‌ఎస్‌బీసీ అభిప్రాయపడింది.  నోమురా తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ రేటింగ్‌ను తగ్గించిన విషయం తెలిసిందే. హెచ్‌డీఎఫ్‌సీకి రికవరి సామర్ధ్యం ఉందని, వాల్యుయేషన్‌ కూడా ఫెయిర్‌గా ఉందని నోమురా అప్పుడు తెలిపింది.


‘‘ పెద్ద పెద్ద తనఖా కంపెనీలు విఫలమైతే లిక్విడిటిలో అసమానతలు ఏర్పడతాయి. అదే మంచి కంపెనీల వలన ఇటువంటి సమస్యలు ఎదురుకావు. ఇప్పుడున్న హౌసింగ్‌ ఫైనాన్స్‌ల కంటే హెచ్‌డీఎఫ్‌సీ పనితీరు బాగుంది. ఇప్పుడున్న అనిశ్చితి పరిస్థితుల్లో కూడా మార్కెట్‌ షేరును పెంచుకునే సామర్య్దం హెచ్‌డీఎఫ్‌సీకి ఉంది’ అని హెచ్‌ఎస్‌బీసీ వివరించింది. ‘బ్యాంకుల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఇంటి రుణాలలో 17శాతం వృద్ధిని సాధించింది.  తీవ్ర పోటి ఉన్నప్పటికి తన 15శాతం మార్కెట్‌ వాటాను కాపాడుకోగలిగింది’ అని తెలిపింది. ‘లిక్విడిటి,ఆస్థి నాణ్యత, ఇతర కారణాల రీత్యా మార్జినల్‌ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ల, 9శాతం మార్కెట్‌ షేరు  ఉన్న ఇతర మేజర్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల పెరుగుదల మందగించడం వలన​మార్కెట్‌ షేరు పెంచుకోడానికి హెచ్‌డీఎఫ్‌సీకి మంచి అవకాశం ఉందని హెచ్‌ఎస్‌బీసీ అభిప్రాయపడింది.  గత ఏడాది మార్చి క్వార్ట్‌ర్‌లో లాభం రూ.2,861.58కోట్లుగా  26.8శాతం లాభాల పెరుగుదలను హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది. దీంతో పాటు రెవెన్యూ కూడా రూ.8,605.40కోట్ల నుంచి రూ.10,342.98 కోట్ల పెరిగిందని, నిరార్థక ఆస్థులు(ఎన్‌పీఏ) 1.22శాతం నుంచి 1.18శాతానికి పడిపోయాయని ప్రకటించింది.  గత ఏడాది కాలంలో సెన్సెక్స్‌ 10.8శాతం లాభాం పొందితే హెచ్‌డీఎఫ్‌సీ షేరు 18.7శాతం​ లాభంతో రూ.2,175.75 (శుక్రవారం ముగింపు) వద్ద ఉంది.



You may be interested

ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాలిస్తూనే ఉంటాం!

Saturday 15th June 2019

ఎస్‌బీఐ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల భవితవ్యంపై గందరగోళం చెలరేగుతున్న తరుణాన ఈ రంగంలోని కంపెనీలకు రుణాలిస్తూనే ఉంటామని ప్రముఖ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలపై డిఫాల్ట్‌ భయాలు పెరిగిపోతున్న తరుణంలో ఎస్‌బీఐ ఈ ప్రకటన చేయడం విశేషం. ఎన్‌బీఎఫ్‌సీ రంగం ఎదుర్కొంటున్న సమస్య మరీ అంత పెద్ద సీరియస్‌ అంశం కాదని, వ్యవస్థ మొత్తం వ్యాపించే అవకాశం లేదని ఎస్‌బీఐ తెలిపింది. ఈ రంగంలో కేవలం కొన్ని కంపెనీలు

14నెలల గరిష్టం నుంచి వెనక్కి

Saturday 15th June 2019

డాలర్‌ ఇండెక్స్‌ రికవరితో పసిడి ధర శుక్రవారం 14నెలల గరిష్టాన్ని తాకింది. అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర స్వల్పంగా 1డాలరు పెరిగి 1,344.50 వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్లో ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో పసిడి ధర 22డాలర్ల లాభపడి 1,362 డాలర్ల వద్ద 14నెలల గరిష్టస్థాయిని అందుకుంది. అయితే మిడ్‌సెషన్‌ నుంచి పసిడి ఫ్యూచర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. గరిష్టస్థాయిల్లో పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ చోటు

Most from this category