News


హెచ్‌ఎస్‌బీసీ సీఈవోకు ఉద్వాసన

Tuesday 6th August 2019
news_main1565073330.png-27573

లండన్‌: హెచ్‌ఎస్‌బీసీ సీఈవో జాన్‌ ఫ్లింట్‌ అనూహ్యంగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. లండన్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ప్రపంచంలో ఏడో అతిపెద్ద బ్యాంకు, ఆర్థిక సేవల కంపెనీగా ఉంది. సొంత దేశంతోపాటు ఆసియాలో ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో నూతన నాయకత్వం అవసరమని హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్‌ పేర్కొంది. పరస్పర అంగీకారం మేరకు ఫ్లింట్‌ వైదొలిగారని, గ్లోబల్‌ కమర్షియల్‌ బ్యాంకింగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న నోయెల్‌ క్విన్‌ తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారని పేర్కొంది. బాధ్యతలు చేపట్టిన 18 నెలల కాలంలోనే ఫ్లింట్‌ తప్పుకోవడం గమనార్హం. ఆయన వచ్చినప్పటి నుంచి హెచ్‌ఎస్‌బీసీ షేరు 14 శాతం నష్టపోయింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి ఈ సంస్థ 4.4 బిలియన్‌ డాలర్ల లాభాన్ని సోమవారం ప్రకటించింది.



You may be interested

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 6 శాతం క్రాష్‌

Tuesday 6th August 2019

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని 11 శాతం వాటాను ప్రమోటర్లు  ఇన్వెస్కో ఒపెన్‌హీమర్‌కు రూ. 4,224 కోట్లకు విక్రయించిన తర్వాత నుంచి జీ షేరు విలువ వరుస సెషన్‌లలో నష్టాల్లో ట్రేడవుతోంది. జీ షేరు మంగళవారం(అగష్టు 6) మధ్యాహ్నం 12.04 సమయానికి 6.69 శాతం నష్టపోయి రూ. 308.80 వద్ద ట్రేడవుతోంది. కాగా గత సెషన్‌లో ఈ కంపెనీ షేరు రూ. 330.95 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఎస్సెల్‌ గ్రూప్‌ ఈ

రూ. 1,000 కోట్ల సమీకరణలో ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌

Tuesday 6th August 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ తాజాగా రూ. 1,000 కోట్ల దాకా నిధులు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీ) ఇష్యూ ఆగస్టు 6న ప్రారంభమవుతుంది. ఐఐఎఫ్‌ఎల్‌ బాండ్లు గరిష్టంగా 10.5 శాతం దాకా వడ్డీ రేటు లభిస్తుంది. 15 నెలల నుంచి 69 నెలల దాకా కాలావధితో ఈ ఎన్‌సీడీలు ఉంటాయని సోమవారం ఇక్కడ జరిగిన విలేకరుల

Most from this category