News


అలహాబాద్‌ బ్యాంక్‌ విలీనం శుభ పరిణామం

Monday 14th October 2019
news_main1571021325.png-28856

  • ఇండియన్‌ బ్యాంక్‌ సీఈఓ పద్మజ చుండూరు

సాక్షి, విజయవాడ: అలహాబాద్‌ బ్యాంకును తమ బ్యాంకులో విలీనం చేయడం శుభ పరిణామమని ఇండియన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ పద్మజ చుండూరు అన్నారు. ఆదివారం ఇక్కడ ఇండియన్‌ బ్యాంక్, అలహాబాద్‌ బ్యాంక్‌ ఉన్నతస్థాయి అధికారులు, ఖాతాదారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 113 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇండియన్‌ బ్యాంక్‌లో అలహాబాద్‌ బ్యాంక్‌ను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సహాసోపేత నిర్ణయం ద్వారా ఇండియన్‌ బ్యాంక్‌ మరింత బలపడుతుందని చెప్పారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. బ్యాంక్‌ దేశ వ్యాప్తంగా 19 వేల మంది ఉద్యోగులతో 2,930 శాఖలతో రూ.4.38 లక్షల కోట్ల వ్యాపారం చేస్తోందని వివరించారు. 2020 ఏప్రిల్‌ 1 నుంచి అలహాబాద్‌ బ్యాంక్‌ విలీనం అమల్లోకి వస్తుందని.. దీంతో రూ.8 లక్షల కోట్లకు పైగా వ్యాపారంతో ఏడో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఇండియన్‌ బ్యాంక్‌ అవతరించనున్నట్లు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 550 ఇండియన్‌ బ్యాంక్‌ శాఖలు ఉన్నాయి. అలహాబాద్‌ బ్యాంక్‌కు ఉన్న 100 శాఖలు కలుపుకుని మరింత బలపడతాం. వ్యవసాయం, వాణిజ్య రంగాలతో పాటు, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తకు రుణాల మంజూరులో అధిక ప్రాధాన్యత ఇస్తాం. ఉద్యోగులు, అధికారుల పదోన్నతుల్లో పూర్తి పారదర్శకత పాటిస్తాం’ అని పద్మజ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇండియన్‌ బ్యాంక్‌ ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ పి.భవర్, అమరావతి జోనల్‌ మేనేజర్‌ పీవీ ప్రసాద్, అలహాబాద్‌ బ్యాంక్‌ సర్కిల్‌ జనరల్‌ మేనేజర్‌ జి.సతీష్‌కుమార్ పాల్గొన్నారు. 



You may be interested

సిప్‌ వైపే ఫండ్స్‌ ఇన్వెస్టర్ల మొగ్గు..

Monday 14th October 2019

ప్రథమార్ధంలో రూ. 49,000 కోట్ల పెట్టుబడులు న్యూఢిల్లీ:     మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ (సిప్స్‌) వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో సిప్‌ మార్గంలో ఫండ్స్‌లోకి ఏకంగా రూ. 49,361 కోట్ల మేర పెట్టుబడులు రావడం ఇందుకు నిదర్శనం. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య

బ్యాంక్స్‌ చీఫ్‌లతో నేడు ఆర్థిక మంత్రి భేటీ

Monday 14th October 2019

రుణ వితరణ తదితర అంశాలపై చర్చ న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షల్లో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం (నేడు) సమావేశం కానున్నారు. చిన్న, మధ్య తరహా సంస్థలు, ఆర్థిక సంక్షోభంలో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) మొదలైన రంగాలకు నిధుల లభ్యత, రుణ వితరణ తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నట్లు సంబంధిత

Most from this category