News


హెచ్‌పీఈ ప్లాట్‌ఫామ్‌పైకి బ్యాంకుల స్టోరేజీ!

Tuesday 23rd October 2018
news_main1540271682.png-21399

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ (ఏపీసీవోబీ), తెలంగాణ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ (టీఎస్‌సీఏబీ)లకు చెందిన సంప్రదాయ స్టోరేజీ మౌలిక సదుపాయాలను హెచ్‌పీఈ 3పీఏఆర్‌ వేదికకు విజయవంతంగా మార్చినట్లు హ్యులెట్‌ ప్యాకర్డ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (హెచ్‌పీఈ) ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో బ్యాంక్‌ ఇంటర్నెట్, మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు వేగవంతమవటమే కాకుండా నిరంతరంగా జరిపే వీలుంటుందని పేర్కొంది.
 



You may be interested

నష్టాల్లో బాటలో ఐటీ షేర్లు

Tuesday 23rd October 2018

మార్కెట్‌ పతనంలో భాగంగా మంగళవారం ఐటీ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని ఇండెక్స్‌ల్లో కెల్లా నిఫ్టీ ఇటీ ఇండెక్స్‌ అత్యధికంగా నష్టపోయింది. నేటి ఉదయం ప్రారంభ సెషన్స్‌లోనే ఐటీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇటీ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. ఉదయం గం.10:20ని.లకు ఇండెక్స్‌ 1.50శాతం నష్టంతో 14,218.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ

రిన్యూ చేతికి వైజాగ్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌

Tuesday 23rd October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇంధన పునరుత్పాదక సంస్థ రిన్యూ పవర్‌ తాజాగా విశాఖపట్నంలో 3 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) నిర్వహించిన బిడ్డింగ్‌ను రిన్యూ గెలుచుకుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) గ్రాంట్‌ను సమకూరుస్తుంది. దీని ద్వారా ఏటా 4.2 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Most from this category