News


హెచ్‌పీసీఎల్‌ లాభం 37శాతం డౌన్‌

Friday 2nd November 2018
news_main1541141510.png-21658

న్యూఢిల్లీ: హిందుస్తాన్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 37 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.1,735 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,092 కోట్లకు తగ్గిందని హెచ్‌పీసీఎల్‌ తెలిపింది. ముడి చమురు ధరలు పెరగడం,  రిఫైనింగ్‌ మార్జిన్‌లు తక్కువగా ఉండడం, విదేశీ మారక ద్రవ్య నష్టాల వల్ల నికర లాభం 37 శాతం తగ్గిందని కంపెనీ సీఎమ్‌డీ ముకేశ్‌ కె. సురానా తెలిపారు.
రూ.887 కోట్ల కరెన్సీ నష్టాలు
గత క్యూ2లో 7.61 డాలర్లుగా ఉన్న ఒక్కో బ్యారెల్‌ స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌(జీఆర్‌ఎమ్‌) ఈ క్యూ2లో 4.81 డాలర్లకు తగ్గిందని పేర్కొన్నారు. అలాగే గత క్యూ2లో రూ.20 కోట్ల విదేశీ మారక ద్రవ్య లాభాలు రాగా, ఈ క్యూ2లో రూ.887 కోట్ల విదేశీ మారక ద్రవ్య నష్టాలు వచ్చాయని వివరించారు. అయితే ఇన్వెంటరీ లాభాలు రూ.792 కోట్ల నుంచి రూ.1,276 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. టర్నోవర్‌ రూ.54,143 కోట్ల నుంచి రూ.73,065 కోట్లకు ఎగసిందని వివరించారు.
రీమినరో డ్రింకింగ్‌ వాటర్‌....
ఈ క్యూ2లో కొత్తగా 131 పెట్రోల్‌ పంప్‌లను ప్రారంభించామని,  దీంతో మొత్తం రిటైల్‌ అవుట్‌లెట్‌ల సంఖ్య 15,255కు పెరిగిందని సురానా తెలిపారు. ఇంధనేతర ఉత్పత్తుల విస్తరణలో భాగంగా రీమినరో పేరుతో రీ మినరలైజ్‌డ్‌  ప్యాకేజ్‌డ్‌ తాగు నీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు.You may be interested

హెచ్‌డీఎఫ్‌సీకి ‘ఐపీఓ’ జోష్‌

Friday 2nd November 2018

25 శాతం వృద్ధితో రూ.2,467 కోట్లకు నికర లాభం -రూ.1,000 కోట్ల ఐపీఓ లాభమే దీనికి ప్రధాన కారణం -18 శాతం వృద్ధితో రూ.11,257 కోట్లకు మొత్తం ఆదాయం న్యూఢిల్లీ:- హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ నికర లాభం(స్డాండ్‌ అలోన్‌) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 25 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,978 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,467 కోట్లకు పెరిగిందని  హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

జీఎస్టీ వసూళ్లు మళ్లీ లక్ష కోట్లు

Friday 2nd November 2018

- ఐదు నెలల తర్వాత అక్టోబర్‌లో రూ.1,00,710 కోట్లు న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఐదు నెలల తర్వాత మళ్లీ లక్షకోట్లు దాటాయి. పండుగల సీజన్‌, పన్ను ఎగవేత నిరోధక చర్యల తీవ్రతరం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. ఆర్థికమంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం- అక్టోబర్‌లో రూ. 1,00,710 కోట్ల జీఎస్‌టీ వసూళ్లు జరిగాయి. వ్యాపార విభాగానికి సంబంధించి 67.45 లక్షల  రిటర్న్స్‌ దాఖలయ్యాయి.

Most from this category