News


మూడింతలైన హెచ్‌పీసీఎల్‌ నికర లాభం

Thursday 6th February 2020
news_main1580963420.png-31552

  • ఇన్వెంటరీ లాభాల వల్లే 
  • రూ.74,288 కోట్లకు తగ్గిన టర్నోవర్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హిందుస్తాన్‌ పెట్రోలియమ్‌ కార్పొ(హెచ్‌పీసీఎల్‌) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో మూడింతలైంది. గత క్యూ3లో రూ.248 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.747 కోట్లకు పెరిగిందని హెచ్‌పీసీఎల్‌ సీఎమ్‌డీ ముకేశ్‌ కె. సురానా వెల్లడించారు. గత క్యూ3లో రూ.3,465 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు రాగా, ఈ క్యూ3లో రూ.343 కోట్ల ఇన్వెంటరీ లాభాలు వచ్చాయని, అందుకే ఈ క్యూ3లో నికర లాభం ఈ రేంజ్‌లో పెరిగిందని వివరించారు. మరిన్ని వివరాలు..., 

1.79 డాలర్లకు తగ్గిన జీఆర్‌ఎమ్‌
గత క్యూ3లో రూ.557 కోట్లుగా ఉన్న విదేశీ మారక ద్రవ్య లాభాలు ఈ క్యూ3లో రూ.82 కోట్లకు తగ్గాయి. స్థూల రిఫైనరీ మార్జిన్‌(జీఆర్‌ఎమ్‌) ఒక్కో బ్యారెల్‌కు 3.72 డాలర్ల నుంచి 1.79 డాలర్లకు తగ్గింది. విశాఖ రిఫైనరీలో కొన్ని యూనిట్లను తాత్కాలికంగా మూసివేయడం జీఆర్‌ఎమ్‌ తగ్గడానికి ఒక కారణం. టర్నోవర్‌ రూ.76,884 కోట్ల నుంచి రూ.74,288 కోట్లకు తగ్గింది. 



You may be interested

యస్‌ బ్యాంక్‌ ఎండీపై చర్యలు తీసుకోండి

Thursday 6th February 2020

ఆర్‌బీఐకి బ్యాంక్ మాజీ డైరెక్టర్ అగర్వాల్ లేఖ న్యూఢిల్లీ: నియంత్రణ సంస్థ నిర్దేశించిన పలు నిబంధనల ఉల్లంఘనకు గాను ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ సీఈవో, ఎండీ రవ్‌నీత్‌ గిల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ బ్యాంక్‌ మాజీ డైరెక్టరు ప్రకాష్ అగర్వాల్ తాజాగా రిజర్వ్ బ్యాంక్‌కు లేఖ రాశారు. అనైతిక విధానాలతో బ్యాంకు బోర్డుపై గిల్ ఆధిపత్యం సాధించారని, క్విడ్ ప్రో కో లావాదేవీలతో బోర్డు సభ్యులను ప్రభావితం చేస్తున్నారని

రూ.11.7 లక్షల కోట్ల పన్నుల లక్ష్యాన్ని సాధిస్తాం: సీబీడీటీ

Thursday 6th February 2020

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.11.7 లక్షల కోట్లను సాధించగమలన్న విశ్వాసాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీడీడీటీ) చైర్మన్‌ పీసీ మోదీ వ్యక్తం చేశారు. డేటా మైనింగ్‌ (సమాచారాన్ని వెలికితీయడం), కృత్రిమ మేథ (ఏఐ)ను ఆదాయం పెంచుకునేందుకు వినియోగిస్తున్నామే తప్ప, చర్యల కోసం కాదన్నారు. బడ్జెట్‌పై సీఐఐ ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీసీ మోదీ పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు

Most from this category