News


ఐఆర్‌సీటీసీ ఐపీఓ అలాట్‌మెంట్‌ స్టేటస్‌ ఇలా చెక్‌ చేసుకోండి!

Thursday 10th October 2019
news_main1570689632.png-28801

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) ఐపీఓకి మంచి స్పందన వచ్చింది. ఈ ఇష్యూ దాదాపు 111 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్‌ అయింది. 2.016 కోట్ల షేర్లకు 225.29 కోట్ల బిడ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐపీఓకి సబ్‌స్క్రైబ్‌ చేసిన ఇన్వెస్టర్లు తమకు షేర్లు దక్కుతాయా? దక్కవా? అని ఉత్కంఠగా చూస్తుంటారు. ఐపీఓకి అప్లై చేసిన వాళ్లకు అక్టోబర్‌ 10 లేదా 11న అలాట్‌మెంట్‌ జరగవచ్చని అంచనా.

అలాట్‌మెంట్‌ అయింది? లేదు? అనే విషయాన్ని ఇలా చెక్‌ చేసుకోవచ్చు...
- ఇన్వెస్టర్లు http://ipo.alankit.com వెబ్‌సైట్‌లో స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు. 
- ఇందుకోసం సైట్‌లోకి వెళ్లాక పాన్‌, డీమాట్‌ అకౌంట్‌ నెంబర్‌, క్లయింట్‌ ఐడీ(డీపీఐడీ) నెంబర్‌ లేదా బిడ్‌ అప్లికేషన్‌ నెంబర్‌ వివరాలు ఎంటర్‌ చేయాలి.
- ఆపైన దిగువన ఇచ్చిన కోడ్‌(captcha) ఎంటర్‌ చేయగానే మీ అలాట్‌మెంట్‌ స్టేటస్‌ తెలుస్తుంది.
- క్లయింట్‌ఐడీ అంటే మీ పోర్టుఫోలియో ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌.
- రిఫండ్‌ ప్రాసెస్‌ కూడా ఈ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.


ఐఆర్‌సీటీసీ షేర్లు ఈ నెల 14న స్టాక్‌ ఎక్చేంజ్‌లో లిస్టవుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 



You may be interested

జియో ఛార్జీల పెంపుతో టెల్కోల జోరు

Thursday 10th October 2019

 రిలయన్స్‌ జియో, ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించడానికి సిద్ధమవ్వడంతో గురువారం టెలికాం కంపెనీల (టెల్కోలు) షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌ కోసం నిర్దిష్ట చార్జీలను (ఐయూసీ) వసూల్‌ చేయడంతో జియో లాభం పెరగనుందని, అంతే కాకుండా ఈ రంగలోని పోటీ కంపెనీలయిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా కంపెనీల లాభాలు కూడా పెరగనున్నాయని విశ్లేషకులు తెలిపారు. ‍కాగా జియో తీసుకున్న

మూడు నెలల కాలానికి ఐదు సిఫార్సులు

Thursday 10th October 2019

వచ్చే మూడు నెలల కాలంలో 10 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. 1. వోల్టాస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 775. స్టాప్‌లాస్‌ రూ. 650. రెండేళ్ల క్రితం ఆల్‌టైమ్‌ హైని తాకింది. అనంతరం కరెక‌్షన్‌ జోన్‌లో ప్రవేశించి రూ. 519 వరకు దిగజారింది. అప్పటి నుంచి రెండు స్థాయిల మధ్య కన్సాలిడేషన్‌ జరుపుతూ వస్తోంది. దీంతో వీక్లీ చార్టుల్లో రౌండింగ్‌ బాటమ్‌ ప్యాట్రన్‌ ఏర్పరిచింది. గత

Most from this category