News


ఇండిగో లొసుగులపై సెబీ దృష్టి

Monday 15th July 2019
news_main1563170841.png-27065

- రంగంలోకి కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా
- గంగ్వాల్‌ ఆరోపణలపై వివరణకు ఆదేశించే అవకాశాలు

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో నిర్వహణ లోపభూయిష్టంగా ఉంటోందంటూ కంపెనీ సహ ప్రమోటరు రాకేష్ గంగ్వాల్ చేసిన తీవ్ర ఆరోపణలపై ఇటు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, అటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ దృష్టి సారించాయి. ఒకవేళ ఆరోపణలు వాస్తవమేనని రుజువైన పక్షంలో కంపెనీ ప్రస్తుతం చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నియంత్రణ సంస్థల నిబంధనలను ఉల్లంఘించేలా ఇండిగో విర్వహణ పాన్‌షాపు కన్నా అధ్వాన్నంగా మారిందని, మరో ప్రమోటరు రాహుల్ భాటియా తాను లబ్ధి పొందేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపిస్తూ గంగ్వాల్ సెబీకి, కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇందులోని ప్రస్తావించిన ఆరోపణలకు పేరాల వారీగా వివరణనివ్వాలంటూ కంపెనీని కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో గంగ్వాల్‌ గ్రూప్‌నకు 37 శాతం, భాటియా గ్రూప్‌నకు 38 శాతం వాటాలు ఉన్నాయి.

గంగ్వాల్ రిస్కులు లేకుండా జాగ్రత్తపడ్డారు: భాటియా గ్రూప్‌
గంగ్వాల్ ఆరోపణలపై భాటియా గ్రూప్‌ (ఐజీఈ) తాజాగా మరో ప్రకటన చేసింది. కంపెనీని ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత ఇద్దరిపైనా సమానంగా ఉన్నప్పటికీ గంగ్వాల్ మాత్రం తనకు రిస్కులు తక్కువగా ఉండేలా చూసుకున్నారని పేర్కొంది. భాటియా, ఆయన తండ్రి కపిల్ భాటియా దాదాపు రూ. 1,100 కోట్ల దాకా సొంత పూచీకత్తునిచ్చారని, గంగ్వాల్ మాత్రం ఈక్విటీ రిస్కులు రూ. 15 కోట్లు కూడా మించకుండా జాగ్రత్తపడ్డారని ఐజీఈ పేర్కొంది. తన బాధ్యతలు సరిగ్గా పాటించని వ్యక్తి ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ లోపించిందంటూ కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది. 



You may be interested

31 శాతం క్రాష్‌....10 ఏళ్ల కనిష్ఠానికి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Monday 15th July 2019

గత కొన్ని క్వార్టర్లలో జరిగిన పరిణామాల కారణంగా..భవిష్యత్తులో కంపెనీగా కొనసాగలేమోనన్న ఆందోళనను హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వ్యక్తం చేయడంతో సోమవారం(జులై 15) ట్రేడింగ్‌లో కంపెనీ షేరు విలువ 30.58 శాతం పడిపోయి రూ.47.55 వద్ద ట్రేడవుతోంది. సోమవారం రూ.61.65 వద్ద ప్రారంభమైన ఈ షేరు జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది.  ఆర్థికంగా తీవ్ర ఒత్తిడి  గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో క్వార్టర్‌లో రూ.2,224 కోట్ల నికర నష్టాలు వచ్చాయని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తెలిపింది. రూ.3,280

ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల కొనుగోలుపై త్వరలోనే మార్గదర్శకాలు

Monday 15th July 2019

న్యూఢిల్లీ: ఎన్‌బీఎఫ్‌సీ రంగం లిక్విడిటీ సమస్యల్లో ఉండడంతో, ఈ రంగంలోని కంపెనీల నుంచి రుణ ఆస్తులను కొనుగోలు చేసే విషయమై ప్రభుత్వరంగ బ్యాంకులకు త్వరలోనే కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఆర్థిక శాఖలోని రెండు ప్రధాన విభాగాల మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, ఎన్‌బీఎఫ్‌సీ రుణ ఆస్తుల కొనుగోలు అర్హత నిబంధనలను ఈ వారం లేదా వచ్చే వారంలో విడుదల చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు.

Most from this category