News


2019 గృహ విభాగానికి నిరాశే

Monday 16th December 2019
news_main1576467445.png-30240

  • గతేడాదితో పోలిస్తే కేవలం 4 శాతం వృద్ధి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ ఏడాది దేశీయ రియల్టీ రంగం ఆశించినంత వృద్ధిని సాధించలేదు. వినియోగ వ్యయం తగ్గడం, పెట్టుబడులు క్షీణించడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం వంటి రకరకాల కారణాలతో దేశీయ రియల్టీ రంగంలో వృద్ధి అవకాశాలను నీరుగార్చాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గతేడాది నాలుగు త్రైమాసికాలు కలిపి 2,48,300 గృహాలు అమ్ముడుపోగా.. 2019లో కేవలం 4 శాతం వృద్ధితో 2,58,410 యూనిట్లకు చేరాయి. ఇందులోనూ అందుబాటు గృహాల విక్రయాలే ఎక్కువగా ఉన్నాయి. అఫడబుల్‌ హౌజింగ్‌లకు పలు పన్ను రాయితీలను కల్పించడమే ఇందుకు కారణం. తొలిసారి గృహ కొనుగోలుదారులకు రూ.3.5 లక్షల పన్ను రాయితీని అందిస్తుంది. ఇది 2020 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకూ అందుబాటులో ఉంటుంది.
రెడీ టు మూవ్‌ గృహాలకే డిమాండ్‌...
రియల్‌ ఎస్టేట్‌ రంగం పనితీరు దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆరేళ్ల క్రితం నాటికి క్షీణించి 4.5 శాతానికి చేరింది. ముంబై, ఎన్‌సీఆర్, బెంగళూరు, పుణే, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గృహాల విక్రయాల్లో డిమాండ్‌ కనిపించింది.. కానీ, మూడో త్రైమాసికం నాటికి మళ్లీ తిరోగమన బాట పట్టిందని చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. కొనుగోలుదారులు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు లేదా 6 నెలల్లో నిర్మాణం పూర్తయ్యే గృహాల కొనుగోళ్ల మీదే ఆసక్తి చూపిస్తున్నారు. లిస్టెడ్, బ్రాండెడ్‌ నిర్మాణ సంస్థలు మాత్రం గృహ విక్రయాల్లో కాసింత ఉపశమనంలో ఉన్నాయి. ఈ ఏడాది గృహ విభాగానికి కలిసొచ్చిన అంశం ఏంటంటే.. దేశవ్యాప్తంగా మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ.25 వేల కోట్ల ఆల్టర్‌నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఏఐఎఫ్‌)ను ఏర్పాటు చేయడమే. You may be interested

భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌.. ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..?

Monday 16th December 2019

రిస్క్‌ వద్దనుకునే వారికి సురక్షిత సాధనం 6.5-7.5 శాతం మధ్య రాబడులు మూడేళ్లు, పదేళ్ల కాల వ్యవధులు స్టాక్‌ ఎక్సే‍్ఛంజీలలో కూడా ట్రేడింగ్‌ భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌.. నూతన మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో) ఈ నెల 12న ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. రిస్క్‌ లేకుండా బ్యాంకు డిపాజిట్ల స్థాయిలో రాబడులు కోరుకునే వారు ఇష్యూను పరిశీలించొచ్చు. ఈ ఇష్యూ ద్వారా కనీసం రూ.7,000 కోట్ల వరకు

పీఎన్‌బీ మొండిబాకీ లెక్కల్లో వ్యత్యాసాలు

Monday 16th December 2019

- రూ. 2,617 కోట్ల మేర డైవర్జెన్స్‌ - ఆర్‌బీఐ ఆడిట్‌లో వెల్లడి న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) దాదాపు రూ. 2,617 కోట్ల మేర మొండిబాకీలు తక్కువగా చూపినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆడిట్‌లో వెల్లడైంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్‌బీఐ లెక్కల ప్రకారం పీఎన్‌బీ స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) రూ. 81,089.70 కోట్లుగా ఉన్నాయి. కానీ పీఎన్‌బీ రూ. 78,472 కోట్లు మాత్రమే ఎన్‌పీఏలుగా చూపించింది.

Most from this category