News


హైదరాబాద్‌లో 32 శాతం తగ్గిన గృహ విక్రయాలు

Tuesday 1st October 2019
news_main1569897367.png-28641

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌లో గృహాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జులై– సెప్టెంబర్‌ త్రైమాసికంలో నగరంలో 3,280 గృహాలు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 32 శాతం తక్కువని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నివేదిక తెలిపింది. సబ్‌ వెన్షన్‌ స్కీమ్‌ రద్దు, మార్కెట్‌ సెంటిమెంట్, ఆర్ధిక మందగమనం వంటి కారణాల వల్ల విక్రయాలు తగ్గాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు.  
దేశవ్యాప్తంగా 18 శాతం డౌన్‌..
దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణే, హైదరాబాద్‌లల్లో 2018 క్యూ3లో 67,140 గృహాలు అమ్ముడుపోగా.. ఈ ఏడాది క్యూ3 నాటికి 18 శాతం క్షీణించి 55,080 యూనిట్లకు తగ్గాయి. 2019 క్యూ2తో పోలిస్తే ఇది 20 శాతం తక్కువ. నగరాల వారీగా క్షీణత గణాంకాలు చూస్తే.. బెంగళూరులో అత్యధికంగా 35 శాతం విక్రయాలు తగ్గాయి. 2019 క్యూ3లో 10,500 యూనిట్లు అమ్ముడుపోయాయి. కోల్‌కతాలో 27 శాతం క్షీణించి, 3,120 యూనిట్లకు, ఎన్‌సీఆర్‌లో 13 శాతం క్షీణతతో 9,830 యూనిట్లు, చెన్నైలో 11 శాతం క్షీణించి.. 2,620 యూనిట్లు, పుణేలో 8 శాతం 8,550 యూనిట్లు, ముంబైలో 6 శాతం క్షీణించి, 17,180 యూనిట్లు విక్రయమయ్యాయి.
తగ్గిన ఇన్వెంటరీ..
2019 జూన్‌ త్రైమాసికం ముగిసే నాటికి ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 6.66 లక్షల యూనిట్లుండగా.. జులై– సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి 6.56 లక్షల యూనిట్లకు తగ్గాయి. 



You may be interested

గ్యాస్‌ ధర 12 శాతం తగ్గింపు

Tuesday 1st October 2019

రెండున్నరేళ్ల తర్వాత తగ్గించిన కేంద్రం  న్యూఢిల్లీ: దేశీయ సహజ వాయువు ధరను కేంద్ర ప్రభుత్వం 12 శాతం తగ్గించింది. రెండున్నరేళ్ల కాలంలో గ్యాస్‌ ధరను కేంద్రం తగ్గించడం ఇదే మొదటిసారి. ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాలు ఉత్పత్తి చేసే గ్యాస్‌ ధరను ఒక్కో మిలియన్‌బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌కు 3.69 డాలర్ల నుంచి 3.23 డాలర్లకు తగ్గించింది. అలాగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నేతృత్వంలోని కేజీ-డీ6 వంటి కష్ట సాధ్యమైన చమురు క్షేత్రాల్లో ఉత్పత్తయ్యే గ్యాస్‌

మార్కెట్లోకి మారుతీ మినీ ఎస్‌యూవీ

Tuesday 1st October 2019

నాలుగు వేరియంట్లలో మారుతీ ఎస్‌-ప్రెస్సో ధరలు రూ.3.69 లక్షల నుంచి రూ.4.91 లక్షల రేంజ్‌లో  మైలేజీ 21.7 కిమీ.  న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ మినీ ఎస్‌యూవీ(స్పోర్ట్స్‌ యుటిలిటి వెహికల్‌), ఎస్‌-ప్రెస్సోను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మినీ ఎస్‌యూవీ ధరలు రూ.3.69 లక్షల నుంచి రూ.4.91 లక్షల రేంజ్‌(ఎక్స్‌ షోరూమ్‌ ధరలు)లో ఉన్నాయి. స్డాండర్డ్‌తో సహా మొత్తం నాలుగు వేరియంట్లు, ఆరు రంగుల్లో ఈ కారు లభ్యమవుతోంది. రెనో క్విడ్‌, డాట్సన్‌ రెడీ-గో,

Most from this category