News


కరోనా ప్యాకేజ్‌...హంకాంగ్‌లో ఒక్కో పౌరుడికి 10,000 డాలర్లు

Wednesday 26th February 2020
news_main1582705847.png-32107

హాంగ్‌కాంగ్‌ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో కరోనా రిలీప్‌ ఫండ్‌కు 15.4 బిలియన్‌ డాలర్లను కేటాయించింది. ఈ మేరకు బుధవారం హాంగ్‌ కాంగ్‌ ఫైనాన్సియల్‌ సెక్రెటరీ పాల్‌ చాన్‌ 18 ఏళ్లు లేదా 18 ఏళ్లు పైబడిన శాశ్వత నివాసులు ఒక్కోక్కరికి 10,000 హాంగ్‌కాంగ్‌ డాలర్లను (రూ.92,000)ఇస్తున్నట్లుగా ప్రకటించారు.కాగా ఈ ఏడాది ఆర్థిక వృద్ధి క్రితం సంవంత్సరంతో పోలిస్తే 1.2శాతం తగ్గి -1.5శాతం -0.5శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా హాంగ్‌కాంగ్‌లో ప్యాకేజీల బడ్జెట్‌ కొనసాగుతుందని చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ క్యారీల్యామ్‌ అన్నారు. నెలల తరబడి సాగుతున్న రాజకీయ అనిశ్చితితో దశాబ్దకాలంగా ఆర్థిక మందగమనం ఉందని, తాజా కోవిడ్‌-19 ప్రభావంతో 2020లో ఆర్థిక వృద్ధి మరింత దిగజారుతుందని క్యారీల్యామ్‌ వెల్లడించారు. ఆర్థిక వాతావరణము కఠినంగా ఉన్నప్పటికీ ప్రతిచక్రియ చర్యలను అమలు చేస్తూ తమ ఆర్థిక నిల్వలను సక్రమంగా వినియోగించుకుంటామన్నారు. ఆయా సంస్థలకు మద్దతు అందించి ఉద్యోగాలను కాపాడడం, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడం ద్వారా హాంగ్‌ కాంగ్‌ ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తుందని తెలిపారు. చైనాభూభాగంతో ప్రాంతీయ సంబంధాలు ఉన్నందున కరోనా వైరస్‌ ప్రభావంతో దెబ్బతినే ఆర్థిక వ్యవస్థల్లో హాంగ్‌కాంగ్‌ ఒకటని అని వివరించారు. 



You may be interested

టారీఫ్‌ల పెంపు ఎఫెక్ట్‌: డిసెంబర్లో తగ్గిన సబ్‌స్క్రైబర్లు..!

Wednesday 26th February 2020

టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్‌ జియోకు తాజాగా షాక్‌ తగిలింది. నవంబర్లో 5లక్షల 60 వేల కొత్త సబ్‌స్క్రైబర్లును కూడకట్టుకున్న జియో... డిసెంబర్‌లో కేవలం 82,308 మంది సబ్‌స్క్రైబర్లను మాత్రమే జతచేసుకున్నట్లు గణాంకాలు తెలిపాయి. తద్వారా మొత్తం సబ్‌స్క్రైబర్‌ బేస్‌ 370 మిలియన్లుగా నమోదైంది. అయినప్పటికీ  జియో ఇప్పటికీ మార్కెట్‌ వాటాలో 32.14 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుంది.  ఏజీఆర్‌ బకాయిలతో సంక్షోభంలో పడ్డ వొడాఫోన్‌ ఐడియా చందాదారుల విషయంలో

రాబోయేది ఎఫ్‌ఎంసీజీ రాజ్యమే!

Wednesday 26th February 2020

తర్వాతి బుల్‌రన్‌లో ఈ రంగమే ఛాంపియన్‌ అంటున్న నిపుణులు వాల్యూ ఇన్వెస్టర్లలో ఎక్కువమందికి కన్జూమర్‌ స్టాకులపై మక్కువ ఎక్కువ. అటు బెంజిమన్‌ గ్రాహమ్‌ నుంచి ఇటు పీటర్‌ లించ్‌ వరకు అనేకమంది కన్జూమర్‌ షేర్లను ఇష్టపడ్డవారే! ఇవి ఎలాంటి ఒడిదుడకులనైనా తట్టుకుంటాయని, భారీ రుణభారాలుండవని, దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్‌ సైకిల్స్‌ ఉండవని నిపుణులు అంచనా వేస్తుంటారు. కానీ ఎక్కువశాతం ఈ స్టాకులు ప్రధాన మార్కెట్‌తో పోలిస్తే వెనుకబడేఉంటుంటాయి. కానీ ఈ ట్రెండ్‌ రివర్సవుతోందని

Most from this category