News


పెరగనున్న హోండా కార్ల ధరలు

Monday 17th June 2019
news_main1560749802.png-26341

  • 1.2% పెంపు యోచన...

న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు హోండా కార్స్‌ ఇండియా వెల్లడించింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, నూతన భద్రతా ప్రమాణాల అమలుకు సంబంధించిన ధరల భారాన్ని వినియోగదారులపై మోపాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ అంశంపై కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (సేల్స్ అండ్‌ మార్కెటింగ్‌) రాజేష్‌ గోయల్‌ మాట్లాడుతూ.. ‘జూలై నుంచి కార్ల ధరలను పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. గత కొంతకాలంగా ముడి పదార్థాల ధరలు పెరుగుతుండడం, భద్రతా ప్రమాణాల అంశాలే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ధరలు 1.2 శాతం మేర పెరిగేందుకు అవకాశం ఉంది’ అని అన్నారు. పెంపు అమలైతే ఈ ఏడాదిలో రెండవ సారి హోండా కార్ల ధరలు పెరిగినట్లు అవుతుంది. ఫిబ్రవరిలో రూ.10,000 మేర ధరలు పెరిగాయి. మరోవైపు ఇతర సంస్థలు కూడా ఈఏడాది జనవరిలో ధరలను పెంచాయి. 2వ దఫా పెంపునకు సిద్ధంగా ఉన్నట్లు మారుతీ సుజుకీ ఇండియా, టయోటా కిర్లోస్కర్, ఇసుజు మోటార్స్ ఇప్పటికే ప్రకటించాయి.You may be interested

బంగారం బాట ఎటు

Monday 17th June 2019

పెట్టుబడి కోసం అయితే భౌతిక బంగారం వద్దు ఆభరణాలు, కాయిన్లపై చార్జీల రూపంలో ఎంతో నష్టం అందుబాటులో ఎన్నో డిజిటల్‌ సాధనాలు వీటిలో పారదర్శకత ఎక్కువ కోరుకున్నప్పుడు నగదు చేసుకునే సౌలభ్యం కేంద్రం అందించే సార్వభౌమ బాండ్లు ఆకర్షణీయం వీటిపై అదనంగా ఏటా 2.5 శాతం వడ్డీ బంగారం గతంలో ఆభరణంగానే ప్రసిద్ధి పొందగా, నేడు ఓ పెట్టుబడి సాధనంగానూ ఎక్కువ డిమాండ్‌ సంతరించుకుంటోంది. ఇతర పెట్టుబడి సాధనాల్లో ఉండే రిస్క్‌ను ఎదుర్కొనేందుకు గాను సురక్షిత సాధనంగా బంగారాన్ని అంతర్జాతీయంగా

పెద్ద టీవీల విక్రయాలకు క్రికెట్‌ జోష్‌..

Monday 17th June 2019

100 శాతం పెరిగిన అమ్మకాలు మెట్రోలతో పాటు చిన్న పట్టణాల్లోనూ భారీ విక్రయాలు ధర రూ. 50 వేల పైనే న్యూఢిల్లీ: క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు వర్షాల దెబ్బతో అభిమానులను నిరాశపరుస్తున్నా.. టీవీల అమ్మకాలకు మాత్రం బాగానే ఉపయోగపడుతున్నాయి. క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ పుణ్యమాని పెద్ద టీవీల అమ్మకాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. క్రికెట్‌ అభిమానులు భారీ స్క్రీన్‌లపై మ్యాచ్‌లను చూసేందుకు ఆసక్తి కనపరుస్తుండటమే ఇందుకు కారణం. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే

Most from this category