News


పాలసీదారులకు ఎల్‌ఐసీ ఆఫర్‌

Tuesday 5th November 2019
news_main1572924479.png-29345

  • రెండేళ్ల పైబడి ల్యాప్స్ అయిన పాలసీలకూ పునరుద్ధరణ అవకాశం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ తాజాగా రెండేళ్ల పైబడి ల్యాప్స్ అయిన పాలసీలను కూడా పునరుద్ధరించుకునే వెసులుబాటు ప్రకటించింది. 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం సాధారణంగా ప్రీమియం చెల్లింపులు ఆపేసిన నాటి నుంచి రెండేళ్ల లోపు మాత్రమే రివైవల్‌కి అవకాశం ఉంది. 2014 జనవరి 1 తర్వాత తీసుకున్న పాలసీలు ల్యాప్స్ అయి రెండేళ్లు దాటిపోతే.. పునరుద్ధరణకు వెసులుబాటు లేదు. అయితే, పాలసీదారులకు జీవిత బీమా కవరేజీ ప్రయోజనాలు లభించేలా వీటిని కూడా రివైవ్ చేసే అవకాశం కల్పించాలంటూ ఐఆర్‌డీఏఐని ఎల్‌ఐసీ కోరింది. దానికి అనుగుణంగానే తాజా మార్పులు చేసింది. వీటి ప్రకారం.. 2014 జనవరి 1 తర్వాత పాలసీలు తీసుకున్న వారు నాన్‌-లింక్డ్‌ పాలసీలను అయిదేళ్ల లోపు, యూనిట్ లింక్డ్‌ పాలసీలను మూడేళ్ల లోపు పునరుద్ధరించుకోవచ్చు. బీమా కవరేజీ కోసం మళ్లీ కొత్త పాలసీ తీసుకోవడం కన్నా.. ఒకవేళ గతంలో ఏదైనా కారణాల వల్ల ఆపేసిన పాత పాలసీ ఏదైనా ఉంటే దాన్ని పునరుద్ధరించుకోవడం శ్రేయస్కరమని ఎల్‌ఐసీ ఎండీ విపిన్ ఆనంద్ పేర్కొన్నారు. 



You may be interested

మొబైల్‌ రీచార్జితో రూ. 4 లక్షల బీమా కవరేజీ..

Tuesday 5th November 2019

భారతి ఎయిర్‌టెల్ ఆఫరు న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్ తమ ప్రీ-పెయిడ్ మొబైల్ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూ. 599 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకునేవారికి రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ కూడా అందించనున్నట్లు తెలిపింది. భారతి యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. సోమవారం కొత్తగా ప్రకటించిన రూ. 599 ప్లాన్‌తో రోజుకు 2 జీబీ డేటా,

బైక్‌ చాల్లే... క్యాబ్‌ ఎందుకు?!

Tuesday 5th November 2019

10 బిలియన్‌ డాలర్లకు చేరిన పరిశ్రమ క్యాబ్‌లతో పోలిస్తే 40 శాతం ధర తక్కువ సిటీలో వేగంగా వెళ్లాలంటే ఇదే బెటర్‌ బైక్‌ డ్రైవర్లుగా మహిళలూ నమోదు మెట్రో రైల్‌తో హైదరాబాద్‌లో 40 శాతం వృద్ధి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బోడ బోడ, హబల్‌ హబల్, ఓజెక్, ఒకాడా... ఇక్కడైతే రాపిడో!!. పేర్లు వేరైనా.. ప్రాంతాలు వేరైనా వ్యాపార మంత్రం ఒక్కటే. అదే బైక్‌ షేరింగ్‌! ఇండోనేషియా, థాయ్‌ల్యాండ్, వియత్నాం, కాంబోడియా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందిన

Most from this category