News


హిందుస్తాన్‌ జింక్‌ లాభం రూ.2,081 కోట్లు

Wednesday 30th October 2019
news_main1572407223.png-29222

  • 15 శాతం వృద్ధి 
  • రూ.5,101 కోట్లకు మొత్తం ఆదాయం 

న్యూఢిల్లీ: వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్తాన్‌ జింక్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.2,081 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఆర్జించిన నికర లాభం, రూ.1,815 కోట్లుతో పోల్చితే 15 శాతం వృద్ధి సాధించామని హిందుస్తాన్‌ జింక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.5,175 కోట్ల నుంచి రూ.5,101 కోట్లకు తగ్గిందని కంపెనీ చైర్మన్‌ కిరణ్‌ అగర్వాల్‌ చెప్పారు. నిర్వహణ లాభం సీక్వెన్షియల్‌గా చూస్తే, 15 శాతం తగ్గి రూ.2,480 కోట్లకు చేరిందని పేర్కొన్నారు.  భవిష్యత్తులో కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.35 మిలియన్‌ టన్నులకు పెంచనున్నామని తెలిపారు. 

రెండో అర్థభాగంలో మంచి పనితీరు !  
ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో మంచి పనితీరు సాధిస్తామని కంపెనీ సీఈఓ సునీల్‌ దుగ్గల్‌ చెప్పారు. కొత్త గనులు అందుబాటులోకి రావడం, ప్లాంట్ల విస్తరణ కార్యకలాపాలు పూర్తికానుండటం దీనికి కారణాలని వివరించారు.  ఆటోమేషన్‌, డిజిటైజేషన్‌లపై పెట్టిన పెట్టుబడులు ఫలితాలనిస్తున్నాయని, వ్యయ నియంత్రణ లక్ష్యాలు సాకారమవుతున్నాయని ‍కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ సౌరభ్‌ వివరించారు. 



You may be interested

గ్యాప్‌అప్‌తో ప్రారంభం

Wednesday 30th October 2019

క్రితం రోజు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం సైతం గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 160పాయింట్లు జంప్‌చేసి 40,000 పాయింట్ల సమీపంలో మొదలయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 11,845 పాయింట్ల సమీపంలో ప్రారంభమయ్యింది. యస్‌బ్యాంక్‌, భారతి ఎయిర్‌టెల్‌, గ్రాసిమ్‌, ఐఓసీ, ఇన్ఫోసిస్‌లు 1-2 శాతం లాభంతో మొదలుకాగా, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌లు స్వల్ప నష్టాలతో ఆరంభమయ్యాయి. 

టెలికామ్‌కు బెయిలవుట్‌?

Wednesday 30th October 2019

సాధ్యాసాధ్యాలపై సెక్రటరీల కమిటీ ఏర్పాటు న్యూఢిల్లీ:  టెల్కోల నుంచి భారీగా రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి సుప్రీంకోర్డు డాట్‌ (టెలకమ్యూనిషన్ల శాఖ)కు అనుమతించిన నేపథ్యంలో- ఆయా కంపెనీల ఆర్థిక స్థితిగతులపై సమీక్షించి, తగిన సలహాలు ఇవ్వడానికి కేంద్రం మంగళవారం ఒక సెక్రటరీల కమిటీ (సీఓఎస్‌)ని ఏర్పాటు చేసింది. సుప్రీం రూలింగ్‌ నేపథ్యంలో- టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు

Most from this category