News


జెట్‌లో పెట్టుబడులపై హిందుజా ఆసక్తి

Wednesday 22nd May 2019
news_main1558509691.png-25882

ముంబై: ఆర్థిక సంక్షోభం కారణంగా దాదాపు నెల రోజుల్నించి కార్యకలాపాలు నిలిపివేసిన ప్రైవేట్ రంగ జెట్‌ ఎయిర్‌వేస్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను హిందుజా గ్రూప్ పరిశీలిస్తోంది. మంగళవారం ఈ విషయం ఒక ప్రకటనలో తెలియజేసింది. "జెట్‌ ఎయిర్‌వేస్‌లో అవకాశాలు పరిశీలిస్తున్నాం" అంటూ హిందుజా గ్రూప్ ఒక ప్రకటన జారీ చేసింది. రుణాలు, నష్టాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఏప్రిల్ 17 నుంచి జెట్‌ ఎయిర్‌వేస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జెట్‌ విక్రయంపై కసరత్తు చేస్తున్నాయి. ఎతిహాద్ గ్రూప్‌ వంటి సంస్థలు బిడ్లు వేశాయి. ప్రస్తుతం వివిధ విమానాశ్రయాల్లో ఖాళీగా ఉన్న జెట్ ఎయిర్‌వేస్ స్లాట్స్‌ను ఇతర ఎయిర్‌లైన్స్‌కు తాత్కాలిక ప్రాతిపదికన కేంద్ర పౌర విమానయాన శాఖ కేటాయించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు హిందుజా గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. హిందుజా గ్రూప్‌నకు ఆటోమోటివ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, విద్యుత్‌, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్‌ తదితర రంగాల్లో కార్యకలాపాలున్నాయి. గ్రూప్ సంస్థల్లో దాదాపు 1,50,000 మంది పైచిలుకు ఉద్యోగులున్నారు.  



You may be interested

ద్రవ్య లభ్యతపై ఆర్‌బీఐ ప్రత్యేక దృష్టి!

Wednesday 22nd May 2019

ఫైనాన్షియల్‌ సంస్థల లిక్విడిటీ పర్యవేక్షణ దీనికోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చెన్నై: బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) సహా ఫైనాన్షియల్‌ సంస్థలకు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలు తలెత్తకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, సమీక్షించడానికి, తగిన సూచనలు చేయడానికి ఆర్‌బీఐలోనే అంతర్గతంగా ప్రత్యేక విభాగాన్ని (కేడర్‌) ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం నేపథ్యంలో నాన్‌-బ్యాంకింగ్‌

ఎక్కడండీ.. ఏటీఎం?

Wednesday 22nd May 2019

రెండేళ్లలో గణనీయంగా తగ్గుదల ఇక ముందూ కొనసాగుతుందని అంచనా తగ్గుదలకు కారణాలపై పలు విశ్లేషణలు 1) బ్యాంకు శాఖల క్రమబద్ధీకరణ 2) పెరిగిన వ్యయాలతో భారంగా నిర్వహణ 3) ఖర్చులను రాబట్టుకోలేకపోవటమూ కారణమే పెద్ద నోట్ల రద్దు తర్వాత మూగబోయిన ఏటీఎంలు ఆ తర్వాత కాలంలో వినియోగంలోకి వచ్చినా కానీ, ఎందుకో గతంలో మాదిరిగా విరివిగా అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తరవాత గత రెండు సంవత్సరాల కాలంలో నగదు లావాదేవీలు

Most from this category