News


హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌ లాభం 55 కోట్లు

Saturday 1st June 2019
news_main1559364501.png-26032

  • 6శాతం వృద్ధి 

న్యూఢిల్లీ: హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌(హెచ్‌జీఎస్‌) కంపెనీ గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.55 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం(రూ.51 కోట్లు)తో పోల్చితే 6 శాతం వృద్ధి సాధించామిన హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.1,004 కోట్ల నుంచి 28 శాతం వృద్ధితో రూ.1,285 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ పార్థ దేసర్కార్‌ పేర్కొన్నారు. సాధారణంగా క్యూ4 పటిష్టమైన క్వార్టర్‌ అని, యాక్సిస్‌పాయింట్‌ హెల్త్‌ పనితీరు మెరుగుపడిందని, దేశీయ వ్యాపారం టర్న్‌అరౌండ్‌ అయిందని వివరించారు. 
తగ్గిన ఏడాది లాభం...
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 11 శాతం తగ్గి రూ.176 కోట్లకు చేరిందని, ఆదాయం మాత్రం 24 శాతం ఎగసి రూ.4,786 కోట్లకు పెరిగిందని పార్థ డి సర్కార్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చినాటికి ఏడు దేశాల్లో 73 గ్లోబల్‌ డెలివరీ సెంటర్లతో 42,190 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 



You may be interested

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ లాభంలో భారీ వృద్ధి

Saturday 1st June 2019

2018-19లో రూ.44.59 కోట్లుగా నమోదు ఒక్కో షేరుకు రూ.3 డివిడెండ్‌ పాతపోస్టాఫీసు (విశాఖ): డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) టర్నోవర్‌ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.698.51 కోట్లకు చేరుకుందని ఆ  సంస్థ శుక్రవారం ప్రకటించింది. 2017–18 సంవత్సరంలో సంస్థ టర్నోవర్‌ రూ.612.12 కోట్లుగా ఉండడం గమనార్హం. 2017–18 ఆర్ధిక సంవత్సరంలో డీసీఐకి రూ.17.14 కోట్ల నికర లాభం రాగా, అది 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రూ.44.59 కోట్లకు వృద్ధి చెందింది. వాటాదారులకు

కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ లాభం రూ.1,389 కోట్లు

Saturday 1st June 2019

ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్‌ న్యూఢిల్లీ: ట్రావెల్‌ కంపెనీ, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ గత ఆర్థిక సంవత్సరం (2018-19) మార్చి క్వార్టర్‌లో రూ.1,388 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) క్యూ4లో రూ.53 కోట్ల నికర నష్టాలు వచ్చాయని కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,214 కోట్ల నుంచి రూ.1,263 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ పీటర్‌ కేర్కర్‌ చెప్పారు. ప్రతి బిజినెస్‌లో సరైన

Most from this category