News


హిందాల్కో లాభం రూ.1,062 కోట్లు

Thursday 13th February 2020
news_main1581568182.png-31746

  • 24 శాతం క్షీణత 
  • రూ.29,494 కోట్లకు తగ్గిన మొత్తం ఆదాయం

న్యూఢిల్లీ: హిందాల్కో ఇండస్ట్రీస్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.1,062 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో ఆర్జించిన నికర లాభం, రూ.1,394 కోట్లుతో పోల్చితే 24 శాతం క్షీణించిందని కంపెనీ ఎండీ సతీశ్ పాయి చెప్పారు. ఆదాయం రూ.33,483 కోట్ల నుంచి రూ.29,494 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. 
పటిష్టంగా నొవెలిస్‌ పనితీరు...
ఆర్థిక మందగమన పరిస్థితులున్నప్పటికీ, ఈ క్యూ3లో మంచి ఫలితాలే సాధించామని కంపెనీ తెలిపింది. అమెరికా అనుబంధ సం‍స్థ, నొవెలిస్‌ పటిష్టమైన పనితీరు, ఉత్పత్తి వ్యయాలు తక్కువగా ఉండటం, భారత వ్యాపారాల కార్యకలాపాలు నిలకడగా ఉండటం దీనికి కారణమని వెల్లడించింది. ఈ క్యూ3లోనే 160 కోట్ల డాల్లర బాండ్లను నొవెలిస్‌ కంపెనీ జారీ చేసింది.  



You may be interested

అశోక్‌ లేలాండ్‌ లాభం 87 శాతం డౌన్‌

Thursday 13th February 2020

రూ.5,189 కోట్లకు తగ్గిన ఆదాయం రెండు నెలల్లో బీఎస్‌-6 హెవీ డ్యూటీ వెహికల్స్‌ న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్‌ లేలాండ్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో 87 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో రూ.429 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.57 కోట్లకు పడిపోయినట్లు అశోక్‌ లేలాండ్‌ ఎమ్‌డీ, సీఈఓ విపిన్‌ సోంధి చెప్పారు.

ఈ నెలాఖరు వరకు ఉచిత ఫాస్టాగ్‌

Thursday 13th February 2020

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ టోల్ సేకరణను మరింత మెరుగుపరచడం కోసం ఈ నెలాఖరు వరకు ఫాస్టాగ్‌లను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది. జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే వాహనానికి ఫాస్టాగ్‌ తప్పనిసరి కాగా, ఈ ఏర్పాటు నిమిత్తం వసూలు చేస్తున్న రూ. 100 చార్జీని ఈ నెల 15 నుంచి 29 వరకు ఎత్తివేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. వినియోగదారులు తమ వాహన రిజిస్ట్రేషన్

Most from this category