News


హిందాల్కోకు మందగమనం సెగ

Tuesday 12th November 2019
news_main1573528451.png-29513

  • నికర లాభం 33 శాతం డౌన్‌ 
  • రూ.29,944 కోట్లకు తగ్గిన ఆదాయం

న్యూఢిల్లీ: హిందాల్కో ఇండస్ట్రీస్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 33 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,448 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.974 కోట్లకు తగ్గిందని హిందాల్కో ఇండస్ట్రీస్‌ తెలిపింది. అంతర్జాతీయ మందగమనం, కమోడిటీల ధరలు తగ్గడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని కంపెనీ ఎమ్‌డీ సతీశ్‌ పాయ్‌ చెప్పారు. ఆదాయం రూ.32,726 కోట్ల నుంచి రూ.29,944 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. 

అమెరికా అనుబంధ సంస్థ, నొవాలిస్‌ అద్భుత పనితీరుకు, ఒడిదుడుకుల్లేని భారత వ్యాపార కార్యకలాపాలు తోడవటంతో నిలకడైన ఫలితాలను సాధించామని వివరించారు. 



You may be interested

అదానీ పోర్ట్స్‌ సెజ్‌ లాభం 72 శాతం

Tuesday 12th November 2019

రూ.1,059 కోట్లకు పెరిగిన నికర లాభం  కార్గో, కంటైనర్‌ విభాగాల్లో పెరుగుతున్న మార్కెట్‌ వాటా  న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌(ఏపీసెజ్‌) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 72 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.614 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,059 కోట్లకు పెరిగిందని ఏపీసెజ్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,922 కోట్ల నుంచి రూ.3,327 కోట్లకు పెరిగిందని

పరిశ్రమలు రివర్స్‌ గేర్‌

Tuesday 12th November 2019

సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి 4.3 శాతం క్షీణత 2011 అక్టోబర్‌లో 5 శాతం మైనస్‌ మళ్లీ ఇప్పుడు అదే తీవ్రత వరుసగా రెండు నెలలుగా నిరాశ ‘మౌలికం’సహా కీలకరంగాలన్నీ మైనస్‌లోనే... న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్‌లో తీవ్ర నిరాశకు గురిచేసింది. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులకు అద్దం పటింది. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం- 2019 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా -4.3 శాతం క్షీణించింది. అంటే 2018 సెప్టెంబర్‌తో పోల్చిచూస్తే (అప్పట్లో

Most from this category