News


డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ పెంపుతో బ్యాంకులకు భారం!

Monday 3rd February 2020
news_main1580726548.png-31474

తమ ప్రీమియం తగ్గించాలంటున్న కమర్షియల్‌ బ్యాంకులు
బడ్జెట్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కవరేజ్‌ను పెంచడం బ్యాంకుల ఆపరేటింగ్‌ వ్యయాలను పెంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు. డీఐసీజీసీ(డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌) ద్వారా అందిచే కవర్‌ గ్యారెంటీని లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో డిపాజిట్ల బీమాకు చెల్లించే ప్రీమియంలపై మదింపు జరపాలని బ్యాంకులు ఆశిస్తున్నాయి. తమ వద్ద ఉన్న మొత్తం అసెసబుల్‌ డిపాజిట్ల సంఖ్య ఆధారంగా బ్యాంకులు డీఐసీజీసీకి అర్ధవార్షిక ప్రీమియంలు చెల్లిస్తాయి. ఈ ప్రీమియంలను బ్యాంకులే సొంతంగా భరిస్తాయి. కస్టమర్ల మీద వేయవు. బ్యాంకులు వరుసగా మూడు అర్ధవార్షిక ప్రీమియం చెల్లింపులు మిస్సయితే డీఐసీజీసీ సదరు బ్యాంకుల లైసెన్స్‌ను రద్దు చేయగలదు. ఆర్‌బీఐకి అనుబంధంగా ఈ కార్పొరేషన్‌ పనిచేస్తుంది. బ్యాంకులు ప్రసుత్తం ప్రతి రూ.10వేల డిపాజిట్‌కు రూ.10 చొప్పున ప్రీమియం చెల్లిస్తున్నాయి. 2005లో ఈ ప్రీమియంల మదింపు జరిగింది. ఈ నేపథ్యంలో కవర్‌ గ్యారెంటీని పెంచినందున ప్రీమియంలపై మదింపు జరగాలని బ్యాంకులు కోరుతున్నాయి. అన్ని బ్యాంకులకు ఒకే ప్రీమియం వర్తింపజేయకుండా రిస్కు ఆధారిత ప్రీమియం చెల్లింపులు తీసుకురావాలని బ్యాంకర్లు కోరుతున్నారు. కమర్షియల్‌ బ్యాంకులు ఎక్కువ ప్రీమియంలు చెల్లిస్తుండగా, కోఆపరేటివ్‌ బ్యాంకులు ఎక్కువ లబ్ది పొందుతున్నాయన్న విమర్శలున్నాయని ఎస్‌బీఐ సీఎఫ్‌ఓ ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు. అందువల్ల ఈ విషయంలో చట్టసవరణ చేయాలని కోరారు. 2018-19 డీఐసీజీసీ నివేదిక ప్రకారం అప్పటివరకు కమర్షియల్‌ బ్యాంకులు చెల్లించిన ప్రీమియంల విలువ రూ. 296కోట్లుకాగా, అప్పటివరకు కోఆపరేటివ్‌ బ్యాంకులు క్లయిమ్‌ చెల్లింపులు రూ. 4822 కోట్లున్నాయి. కమర్షియల్‌ బ్యాంకులు విఫలం కావడం జరిగి దశాబ్దాలవుతున్నందున కోఆపరేటివ్‌ బ్యాంకులతో సమానంగా తమను ప్రీమియం చెల్లించమనడం అసమంజసమని వాణిజ్యబ్యాంకులు వాపోతున్నాయి. 



You may be interested

యస్‌బ్యాంక్‌ స్థానంలోకి శ్రీ సిమెంట్‌..?

Monday 3rd February 2020

నిఫ్టీ 50 నుంచి యస్‌ బ్యాంక్‌ తన స్థానాన్ని కోల్పోనుంది. 2020 మార్చి 31 నుంచి యస్‌బ్యాంక్‌ స్థానంలో శ్రీ సిమెంట్‌ రానుందని ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్‌ అండ్‌ సెక్యూరిటిస్‌ అంచనా వేసింది. నిఫ్టీ50 తరువాతి సమీక్షలో శ్రీ సిమెంట్‌ నిఫ్టీ ఇండెక్స్‌లోకి వస్తుందని, ఎన్‌ఎస్‌ఈ ప్రమాణాలకు లోబడే యస్‌ బ్యాంక్‌ స్థానంలో శ్రీ సిమెంట్‌ వస్తుందని  తెలిపింది. కాగా ఏడాదికి రెండు సార్లు నిఫ్టీ50 సమీక్షలు జరుగుతాయి. ఆరు

బడ్జెట్‌ నష్టాలకు చెక్‌- మార్కెట్లు అప్‌

Monday 3rd February 2020

ఇంట్రాడేలో 40,000 దాటిన సెన్సెక్స్‌  62 పాయింట్లు లాభపడిన నిఫ్టీ ప్రభుత్వ రంగ బ్యాంకులు బోర్లా ఒక్క రోజులోనే బడ్జెట్‌ నష్టాలకు చెక్‌ పడింది. అయితే ఆద్యంతం ఒడిదుడుకులు తలెత్తాయి. చివరికి కొనుగోళ్లదే పైచేయికావడంతో మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 137 పాయింట్లు పుంజుకుని 39,872 వద్ద నిలవగా.. నిఫ్టీ 62 పాయింట్లు బలపడి 11,724 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,015 వద్ద గరిష్టాన్ని తాకగా.. 39,563 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఈ

Most from this category