News


హెక్సావేర్‌ చేతికి అమెరికా కంపెనీ

Saturday 15th June 2019
news_main1560575536.png-26317

  • డీల్‌ విలువ రూ.1,266 కోట్లు

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన మోబిక్విటీ కంపెనీని మన దేశానికి చెందిన ఐటీ కంపెనీ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ కొనుగోలు చేసింది. ఈ కంపెనీని రూ.1,266 కోట్లకు (18.2 కోట్ల డాలర్ల) కొనుగోలు చేశామని హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ తెలిపింది.  తమ కంపెనీ చరిత్రలో ఇదే అతి పెద్ద కొనుగోలని కంపెనీ సీఈఓ ఆర్‌.శ్రీకృష్ణ పేర్కొన్నారు. మోబిక్విటీ దన్నుతో భారీ డిజిటల్‌ ఏజెన్సీలు, కన్సల్టింగ్‌ సంస్థలతో నేరుగా పోటీపడతామన్నారు. ఈ కంపెనీ కొనుగోలుతో కొత్త వృద్ధి దశలోకి ప్రవేశిస్తున్నామని పేర్కొన్నారు. 
దిగ్గజ బ్రాండ్లకు డిజిటల్‌ ఉత్పత్తులు...
అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, రోబోబ్యాంక్‌, ఫిలిప్స్‌, వావా, బ్యాక్‌బేస్‌, ఒత్సుక వంటి బ్రాండ్లకు డిజిటల్‌ ఉత్పత్తులను మోబిక్విటీ కంపెనీ అందిస్తోంది. గత ఏడాది ఈ కంపెనీ 7 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌కు రూ.1,264 కోట్ల ఆదాయం సాధించింది. 



You may be interested

ఎయర్‌సెల్‌ స్పెక్ట్రమ్‌ను అమ్మేందుకు ప్రయత్నాలు..

Saturday 15th June 2019

ఇతర టెలికాం కంపెనీలతో చర్చిస్తున్నా యూవీఏఆర్‌సీఎల్‌ ఎయిర్‌సెల్‌ ప్రతిపాదిత కొనుగోలుదారు, రిజల్యూషన్‌ ప్రోఫెషనల్‌ యూవీ ఎసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కో. లిమిటెడ్‌(యూవీఏఆర్‌సీఎల్‌) దివాలా తీసిన ఎయిర్‌సెల్‌ స్పెక్ట్రమ్‌ను అమ్మేందుకు భారతి ఎయిర్‌టెల్, వోడఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో టెలికాం కంపెనీలతో చర్చలు మొదలుపెట్టింది. ఇది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌(డీఓటీ) వైఖరికి వ్యతిరేకంగా ఉందని, టెలికాం స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వ వేలం పాట ద్వారానే విక్రయించాలని విశ్లేషకుల భావిస్తున్నారు. కాగా రుణదాతల కమిటీ(సీఓసీ) అమోదించిన రిజల్యూషన్‌

ఎన్‌డీటీవీ ప్రణయ్‌రాయ్‌పై సెబీ నిషేధం

Saturday 15th June 2019

ఆయన భార్యపై కూడా  నిషేధం రెండేళ్లపాటు  న్యూఢిల్లీ: ఎన్‌డీటీవీ ప్రమోటర్‌ ప్రణయ్‌ రాయ్‌పై మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నిషేధం విధించింది. ఎన్‌డీటీవీ ప్రమోటర్లైన ప్రణయ్‌ రాయ్‌, ఆయన భార్య రాధికా రాయ్‌, హోల్డింగ్‌ కంపెనీలు రెండేళ్ల పాటు క్యాపిటల్‌ మార్కెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనకుండా సెబీ నిషేధించింది. ఈ రెండేళ్లలో ప్రణయ్‌ రాయ్‌, రాధికా రాయ్‌లు బోర్డ్‌ పదవితో పాటు ఎలాంటి ఉన్నతోద్యోగాలు చేపట్టరాదని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా

Most from this category